అల్లు అర్జున్ సంచలనం..ఆ ఒక్క ట్వీట్‌తో మెగా వార్‌కు ముగింపు
మెగా వార్‌కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముగింపు పలికారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు అల్లు అర్జున్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ''పవర్ స్టార్ & DCMకి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే @పవన్ కళ్యాణ్ గారు'' అంటూ అల్లు అర్జున్ తన సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెష్ తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు నాడు కూడా అల్లు అర్జున్ విషెష్ తెలిపారు. దీంతో మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీల మధ్య వైరానికి తెర పడినట్టే అని అభిమానులు భావిస్తున్నారు. గత కొద్దిరోజులుగా మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీల మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కల్యాణ్‌కు అండగా నిలిస్తే..ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు. నంద్యాల వైసీపీ అభ్యర్థి, తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడమే కాకుండా..అక్కడి వెళ్లి మరీ ప్రచారంలో పాల్గొన్నారు. అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు.

ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి.పైకి అంతా బాగానే ఉందని చెబుతున్నప్పటికి, లోలోపల మాత్రం వివాదాలు ఈ రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే సాగుతున్నట్టు కనిపించింది. ఇక మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య అయితే వార్ తారస్థాయికి చేరుకుంది. సోషల్ మీడియా వేదికగా ఇరువురు అభిమానులు యుద్దం చేసుకుంటున్నారు. నాగబాబు అల్లు అర్జున్‌ను ఉద్దేశించి ట్వీట్ చేయడం, పవన్ కల్యాణ్ పరోక్షంగా అల్లు అర్జున్ గురించి మాట్లాడటం జరిగింది. ఇదే సమయంలో జనసేన ఎమ్మెల్యేలు సైతం అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప-2 సినిమా విడుదల అడ్డుకుంటామని హెచ్చరించారు.
Many happy returns of the day to Power Star & DCM @PawanKalyan garu
— Allu Arjun (@alluarjun) September 2, 2024
వీరికి కౌంటర్‌గా అల్లు అర్జున్ ..నన్ను ప్రేమించే వాళ్ల కోసం నిలబడగలగాలి. మన అనుకున్న వాళ్ల కోసం ఎంత వరకైనా వెళ్తా.. అది మీ అందరికి తెలుసంటూ కామెంట్ చేశారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరినట్టు అయింది. అయితే తాజాగా ఈ వార్‌కు అల్లు అర్జున్ ముగింపు పలికారు. ఎవరూ ఊహించని విధంగా అల్లు అర్జున్ పవన్ కల్యాణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మరి అల్లు అర్జున్ పవనకు బర్త్ డే విషెష్ తర్వాత అయిన అభిమానులు ఈ యుద్దాన్ని ఆపుతారో లేదో చూడాలి.












Click it and Unblock the Notifications