మెగా కాంపౌండ్ లో జోష్: పెళ్లి తేదీ అనౌన్స్

అల్లు శిరీష్ తన వివాహ తేదీని అధికారికంగా ప్రకటించాడు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. దీనిపై సరదాగా ఓ రీల్ పోస్ట్ చేశాడు. తన మేనకోడళ్లు, మేనల్లుడితో కలిసి చేసిన ఈ రీల్ క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ క్రియేటివ్ వీడియో అభిమానుల దృష్టిని తనవైపు తిప్పుకొంది. అల్లు శిరీష్ తన ప్రియురాలు నయనికతో కలిసి 2026 మార్చి 6వ తేదీన పెళ్లిపీటలు ఎక్కనున్నాడు. ఈ వీడియో ద్వారా అతను ఈ విషయాన్ని వెల్లడించాడు.

అల్లు శిరీష్, నయనికల నిశ్చితార్థ వేడుక ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీన జరిగిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది అల్లు అరవింద్ కుటుంబం. ఈ సందర్భంగా వారు ఉంగరాలు మార్చుకున్నారు. అప్పట్లో పెళ్లి తేదీని వెల్లడించలేదు. 2026లో పెళ్లి జరుగుతుందనే హింట్ ఇచ్చారు. దీనికి అనుగుణంగా తాజాగా పెళ్లి తేదీని ప్రకటించాడు అల్లు శిరీష్.

Allu Sirish Announces Wedding Date with Nayanika in Viral Reel

టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్న శిరీష్‌కు అభిమానుల నుండి అభినందనలు వెల్లువెత్తాయి. అల్లు అర్జున్, రామ్ చరణ్, చిరంజీవి వంటి అల్లు కుటుంబంలోని టాప్ సెలెబ్రెటీలందరూ ఈ పెళ్లి వేడుక సందర్బంగా ఒకే వేదిక మీదికి రాబోతోండటం ఇప్పటి నుంచే అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. ఉత్సాహాన్ని రేకెత్తించింది. హల్దీ, సంగీత్, వివాహ వేదిక.. వంటి ఇతర కార్యక్రమాల వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+