వారి వల్లే నైనికాని కలిశా.. అలా మా లవ్ స్టోరీ మొదలైందన్న అల్లు శిరీష్ !!
టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నారు. రీసెంట్ గానే నైనికా రెడ్డి అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి ఎంగేజ్ మెంట్ వేడుక హైదరాబాద్ లోని వధువు నివాసంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాల సభ్యులతో పాటు కొద్దిమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో జంట ఉంగరాలు మార్చుకున్నారు. తెలుపు రంగు కుర్తా పైజామాలో శిరీష్.. ఎరుపు రంగు శారీలో నైనిక మెరిశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
అల్లు కుటుంబంలో ఇటీవలే తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నమ్మ కొద్దిరోజుల క్రితమే మృతి చెందారు. ఆ తర్వాత ఫ్రాన్స్‌లోని ఈఫిల్ టవర్ వద్ద నైనిక చేతిని పట్టుకున్న ఫొటోను షేర్ చేస్తూ.. నైనికతో వివాహం చేసుకోబోతున్నట్టు అనౌన్స్ చేశారు. దాంతో అప్పటి నుంచి నైనికా ఎవరు? ఆమె ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటి ? వీరి పరిచయం ఎలా జరిగింది? లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయ్యిందని నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.

అలానే పరిచయం..
రీసెంట్ గా వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. శిరీష్ తన ప్రేమ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆ పోస్టులో.. లవ్లీ కపుల్ వరుణ్ తేజ్ & లావణ్యకు రెండవ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు! అక్టోబర్ 2023లో వరుణ్ & లావణ్య పెళ్లి కుదిరినప్పుడు, నితిన్ & షాలిని వారి కోసం ఒక పార్టీ ఇచ్చారు. షాలిని తన ప్రాణ స్నేహితురాలు నైనికాను కూడా ఆ వేడుకకు ఆహ్వానించింది.
అలా ఆరోజు నేను, నైనికా మొదటిసారి కలుసుకున్నాం. ఆ తర్వాత ప్రేమలో ఎంతో సంతోషంగా ఉన్నాం. రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నాం. ఏదో ఒక రోజు, మా పరిచయం ఎలా ప్రారంభమైందని నా పిల్లలు నన్ను అడిగినప్పుడు, నేను వారికి ఇదే చెప్తాను. నన్ను వారి ఫ్రెండ్స్ సర్కిల్‌లో జాయిన్ చేసుకున్న నైనికా స్నేహితులందరికీ థ్యాంక్స్ అని పేర్కొన్నారు.
ఇక గతంలో కూడా పలు ఇంటర్వ్యూస్ లో అల్లు శిరీష్ ప్రేమ, పెళ్లి గురించి అడిగారు. కానీ ఎప్పుడు సినిమా ప్రమోషన్స్‌లో ఏదైనా ఉంటే స్వయంగా చెప్తానని ప్రశ్నలను దాటవేసేవారు. ఇప్పుడు సడన్ గా అనౌన్స్ మెంట్ ఇచ్చి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుండడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ పోస్ట్ ఫుల్ వైరల్ గా మారింది.
-
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
ఉగాది పండగ వేళ చిరంజీవి సంచలన నిర్ణయం.. -
సమంత, రాజ్ నిడిమోరు క్యూట్ వీడియో వైరల్..! -
అన్న మళ్లీ హిట్ కొట్టాడోచ్.. పవన్ కళ్యాణ్ "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ రివ్యూ..! -
అనుష్క పెళ్లి ట్విస్ట్: ఆ విషయాన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారు? -
'బెడ్ రూమ్ లో నా భర్త చేసేది ఇదీ'.. రాజ్ నిడిమోరుపై సమంత వైరల్ పోస్ట్.. -
తెలంగాణ గద్దర్ అవార్డుకు ఎంపికైన తొలి బయోపిక్ ఇదే.. స్పెషాలిటీ అదే !! -
చిరంజీవి కూతురుగా బ్లాక్ బస్టర్ మూవీ హీరోయిన్.. ఎవరంటే..? -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
రామ్ చరణ్ 'పెద్ది'లో క్రేజీ ఐటమ్ సాంగ్.. ముగ్గురు స్టార్ హీరోయిన్లతో మాస్ స్టెప్పులు -
'జబర్దస్త్' యాంకర్ ఛాన్స్ వదులుకున్న నటి ఎవరో తెలుసా? అనసూయ స్థానంలో..











Click it and Unblock the Notifications