ఇట్స్ అఫిషియల్.. అల్లు శిరీష్‌కి కాబోయే భార్య ఎవరంటే..?
అల్లు ఫ్యామిలీ.. తెలుగు చిత్ర పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అల్లు రామలింగయ్య వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన అల్లు అరవింద్.. టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్నారు. ఆయన మూడో కుమారుడు అల్లు శిరీష్ తనదైన శైలిలో సినిమాలు చేస్తూ హీరోగా రాణిస్తున్నారు. అయితే అల్లు కుటుంబంలో ఇటీవలే తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నమ్మ కొద్దిరోజుల క్రితమే మృతి చెందారు. కాగా ఇప్పుడు అల్లు వారి ఇంట పెళ్లి సందడి మొదలు కానుంది. శిరీష్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నట్టు తెలుస్తోంది.
కాగా ఈ శుభవార్తను అల్లు శిరీష్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ మేరకు ఆ పోస్టులో నైనికా అనే అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నట్లు తెలుపుతూ ఓ ఫొటో షేర్ చేశాడు. ఈ నెల 31న తమ నిశ్చితార్థం జరగనున్నట్టు ప్రకటించారు.ఈ మేరకు ఫ్రాన్స్‌లోని ప్రఖ్యాత ఈఫిల్ టవద్ వద్ద తన ప్రేయసి నైనికా చేతిని పట్టుకుని కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ ఫుల్ వైరల్ అవుతోంది. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అల్లు హీరోకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అలానే ఆ పోస్టులో.. ఈరోజు మా తాతగారు అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా, నా హృదయానికి చాలా దగ్గరగా ఉన్న విషయాన్ని నాతో పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. త్వరలో నయనికతో నిశ్చితార్థం జరగనుంది. ఇటీవల మరణించిన నాయనమ్మ , నా వివాహం చూడాలని ఎప్పుడూ కోరుకునేది. ఆమె మాతో లేకపోయినా.. నా ఈ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు ఆమె పైనుండి మమ్మల్ని ఆశీర్వదిస్తుందని నాకు తెలుసు. మా కుటుంబాలు మా ప్రేమను ఇంత ఆనందంతో స్వీకరించడం మాకు ఆనందంగా ఉందని రాసుకొచ్చారు.
అమ్మాయి ఎవరంటే..?
నైనికా హైదరాబాద్‌కి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త కుమార్తె అని సమాచారం. అల్లు ఇంటికి కాబోయే కోడలికు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అలాగే ఆమె ఫేస్ ఎప్పుడెప్పుడు రివీల్ అవుతుందా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
అల్లు శిరీష్ కెరీర్..
'గౌరవం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో.. ఇప్పటి వరకు గ్రాండ్ సక్సెస్ ని మాత్రం అందుకోలేకపోయారు. మొదటి సినిమా ఆశించిన స్థాయిలో అలరించకపోయినా.. కొత్త జంట, ఏబీసీడీ, శ్రీరస్తు శుభమస్తు వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చివరిగా 'టెడ్డీ' చిత్రంతో వచ్చిన శిరీష్ మరోసారి ప్రేక్షకులను నిరాశపరిచాడు.












Click it and Unblock the Notifications