వీడియో వైరల్: స్నేహా రెడ్డికి ఖరీదైన బహుమతి ఇచ్చిన అల్లు అర్జున్..

భార్యాభర్తల అన్యోన్యానికి గుర్తుగా దంపతులిద్దరూ ఒకరికొరకు బహుమతులు ఇచ్చుకోవడం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. సెలబ్రిటీ కపుల్స్ నుంచి సామాన్యుల వరకు ఎవరికి తోచిన విధంగా వాళ్లు.. ఎవరి రేంజ్ లో వాళ్లు ఇలా గిఫ్ట్స్ ను ఇచ్చిపుచ్చుకుంటారు. అయితే సినిమా ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీ కపుల్స్ తమ పెళ్లి రోజు, పుట్టిన రోజును గ్రాండ్ గా జరుపుకుంటారు. ఖరీదైన బహుమతులను ఇచ్చి వారిని సర్ ప్రైజ్ చేస్తుంటారు. రీసెంట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన భార్య స్నేహా రెడ్డికి ఖరీదైన బహుమతిని అందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల వివాహం 2011 మార్చి 6న ఘనంగా జరిగింది. అయితే వీరి పెళ్లి జరిగి నేటికి 14 సంవత్సరాలు పూర్తయి.. 15వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా అల్లు అర్జున్ తన భార్యకు ఖరీదైన బహుమతిని ఇచ్చాడు. బెంజ్ కార్ లేటెస్ట్ మోడల్ ను స్నేహా రెడ్డి కి బహుమతిగా ఇచ్చాడు బన్నీ. భర్త ఇచ్చిన సర్ ప్రైజ్ ను చూసి ఒక్కసారిగా భర్తను హగ్ చేసుకుని ముద్దు పెట్టుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఇక అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ వివాహం కూడా ఇటీవల మార్చి 6నే జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి అటు సినిమా ఇండస్ట్రీ నుంచే కాకుండా రాజకీయ, బిజినెస్ ప్రముఖులు కూడా హాజరయ్యారు. నూతన జంటను ఆశీర్వదించారు. ఇక అల్లు అర్జున్, అల్లు శిరీష్ పెళ్లి ఒకే రోజు జరగడం విశేషం. ఇక అల్లు శిరీష్, నయనికా రెడ్డి జంట కూడా అల్లు అర్జున్ , స్నేహా రెడ్డి లాగానే అన్యోన్యంగా ఉండాలని కోరుకుంటున్నారు అభిమానులు.

AlluArjun Gifts Lavish Surprise to wife Sneha Reddy on 15th Anniversary Viral Video Melts Hearts

ఇక పుష్ప-2 తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్.. తన తర్వాతి మూవీని కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీని భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+