'ధురంధర్' దర్శకుడితో అల్లు అర్జున్ మూవీ.. టైటిల్ ఇదేనా..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప- 2 సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 1500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. పుష్ప- 2 చిత్రం తర్వాత అల్లు అర్జున్ అన్నీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ AA22xA6 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది. ఇక షూటింగ్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇక ఈ సినిమా హాలీవుడ్ మూవీస్ కు ఏ మాత్రం తీసిపోదని ఇటీవల డైరెక్టర్ అట్లీ తెలిపాడు. దాంతో ఈ మూవీపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి.
అలాగే తాజాగా తమిళ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ మూవీ చేయబోతున్నాడు. ఈ కాంబోలో సినిమాను కన్ఫార్మ్ చేస్తూ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ స్పెషల్ వీడియో గ్లింప్స్ ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. ఈ సంవత్సరమే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఇది '#AA23' వర్కింగ్ టైటిల్ తో ప్రారంభం కానుంది. ఇక అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.
అయితే తాజాగా ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఉరి, ధురంధర్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన ఆదిత్య ధర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. ఇటీవల ఆదిత్య ధర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను బన్నీకు వినిపించగా దానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇక ఆదిత్య ధర్ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన ధురంధర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్ హిట్ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 1500 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. ఇక ఈ మూవీకి సీక్వెల్ గా ధురంధర్-2 మూవీ మార్చి 19న విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీ తర్వాత ఆదిత్య ధర్ తన తరువాతి చిత్రాన్ని అల్లు అర్జున్ తో తీయబోతున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications