పెళ్లికి ముందు అతని వల్ల గర్భవతిని అయ్యాను..అమలాపాల్ సంచలన కామెంట్స్
హీరోయిన్ అమలాపాల్ ఏం చేసిన సంచలనమే అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఆమె పెళ్లి , విడాకులు, రెండో పెళ్లి, ప్రెగ్నెన్సీ అన్ని కూడా సంచలనమే చెప్పాలి. అమలాపాల్‌కు తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ ఉంది. తమిళ హీరోయిన్‌గా అడుగుపెట్టినప్పటికి, తెలుగులో కూడా ఆమెకు మంచి క్రేజ్ దక్కించుకుంది. ఇదే సమయంలో ఆమె వ్యక్తిగత జీవితంతో కూడా అమలాపాల్ వార్తల్లో నిలిచారు.అమలాపాల్ వైవాహిక జీవితం గురించి అందరికి తెలిసిన విషయమే.
దర్శకుడు విజయ్‌ను అమలాపాల్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత విభేదాలు తలెత్తడంతో ఈ ఇద్దరు విడాకులు తీసుకున్నారు. విడాకులు అనంతరం తిరిగి సినిమాల్లో నటించిన అమలాపాల్.. గతంలో కంటే హాట్‌గా కనిపించి అభిమానులను అలరించింది. జగత్ దేశాయ్ అనే ఈవెంట్ మేనేజర్‌తో కొన్నాళ్లు డేటింగ్ చేసిన అమలాపాల్ ఇతనే నా ప్రియుడు అంటూ అభిమానులకు పరిచియం చేసింది. గత ఏడాది అక్టోబర్ 26న ప్రియుడు జగత్ దేశాయ్‌ను పరిచియం చేసిన అమలాపాల్ ..సరిగ్గా పది రోజుల్లోనే అతన్ని పెళ్లి చేసుకుని అభిమానులకు షాకిచ్చింది.

అమలాపాల్ ఇంత సడన్‌గా పెళ్లి చేసుకోవడంపై అప్పట్లోనే నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. అమలాపాల్ ఇంత త్వరగా పెళ్లి చేసుకోవడానికి కారణం ఆమె ప్రెగ్నెంట్ అయిందని అందుకే ఆమె త్వరగా పెళ్లి చేసుకుందని మాటలు తెర మీదకు వచ్చాయి. తాజాగా దీనిపై ఆమె స్పందించారు. తాను పెళ్లికి ముందు గర్భవతిని అయ్యానని చెప్పి షాకిచ్చారామె. తాజాగా ఆమె ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ..నేను నా జీవితంలో మొదటి దశలో ఎంతో నష్టపోయాను. అందుకే రెండవ దశను ప్రారంభించడానికి కాస్త వెనకడుగు వేశాను.
కానీ నా భర్త నా ఆలోచనలు అన్నింటినీ మార్చేశాడు.. మేము పెళ్లికి ముందు డేటింగ్ చేశాము. నా బాయ్ ఫ్రెండ్ నిర్ణయాలను కాదనలేక పోయాను. అందుకే డేటింగ్ చేసిన నెల రోజులకే నేను గర్భం దాల్చాను. అందుకే వెంటనే పెళ్లి చేసుకున్నాము అంటూ సంచలన విషయాలను వెల్లడించింది. అమలాపాల్‌కు ఓ బాబు జన్మించాడు.బాబుకు జన్మనిచ్చిన తర్వాత తిరిగి సినిమాల్లో నటిస్తోంది అమ్మడు. లెవల్ క్రాస్ అనే మలయాళ మూవీ చేస్తుంది.ఆసిఫ్ అలీ, అమలా పాల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.












Click it and Unblock the Notifications