సురేఖ వాణి కూతురు చంపేసిందిగా..!

Amaravathiki Ahwanam Movie Review: కంటెంట్ ఉన్న చిత్రాలను నిర్మిస్తూ తమకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకుంది లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యాన‌ర్‌. ఈ సంస్థలో వచ్చిన కొత్త సినిమా అమరావతికి ఆహ్వానం. ప్రమోషనల్ కంటెంట్‌తోనే ప్రేక్షకుల్లో ఎంతో క్యూరియాసిటీ క్రియేట్ చేసిందీ చిత్రం. శివ కంఠంనేని, ధ‌న్య బాల‌కృష్ణ‌, ఎస్తేర్, సుప్రిత, హ‌రీష్ ప్రధాన పాత్రల్లో నటించిన 'అమరావతికి ఆహ్వానం' సినిమాను దర్శకుడు జీవీకే రూపొందించారు. ఓ డిఫరెంట్ హారర్ థ్రిల్లర్‌గా థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంతగా మెప్పించిందో రివ్యూలో చూద్దాం.

కథ

ఒక పోలీస్ ఆఫీసర్ కుటుంబం, మరొక జమీందారీ కుటుంబం నేపథ్యంగా ప్రధానంగా కథ సాగుతుంది. ఈశ్వర్ (శివ కంఠంనేని) ఒక మంచి పోలీస్ ఆఫీసర్. ఆయనకో అందమైన ఫ్యామిలీ. భార్య భానుమతి (ధన్య బాలకృష్ణ), ఆమెకు భార్గవి(సుప్రిత), విజ్జు చెల్లెల్లు ఉంటారు. భార్గవి(సుప్రిత)కి సోషల్ మీడియా అంటే చాలా ఇష్టం. త్వరగా ఫేమ్ అయిపోయి అందరిలో గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటపడుతుంటుంది. దెయ్యాల కాన్సెప్ట్‌తో వైరల్ వీడియోలు చిత్రీకరించి అప్ లోడ్ చేస్తుంటుంది. ఆమె చేసిన ఓ వీడియో వైరల్ అవుతుంది. దాంతో భార్గవి సెలబ్రిటీ అయిపోతుంది. ఇంతలో దెయ్యాలు ఉన్నాయంటూ నిరూపిస్తానని ఓ వ్యక్తి ఫోన్ చేస్తాడు. భార్గవిని ఒంటరిగా పంపలేక కుటుంబ సభ్యులు ఈశ్వర్, భానుమతి కూడా అతను చెప్పినట్లే అమరావతి అనే ఊరికి వెళ్తారు. ఈ ఊరిలో జమిందారీ రాజేశ్వరి(ఎస్తేర్) భవంతిలోకి అడుగుపెడతారు. అక్కడ ఈశ్వర్ కుటుంబానికి అనూహ్య ఘటనలు ఎదురవుతాయి. జమిందారీ వంశ వారసురాలు రాజేశ్వరికి ఒక విషాధకరమైన ప్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ ప్లాష్ బ్యాక్ ఏంటి, ఈశ్వర్ కుటుంబం ఆ భవంతిలో జరిగిన ఘటనలు ఎలా ఎదుర్కొన్నారు. ఈశ్వర్ కుటుంబానికి జమీందారి రాజేశ్వరి కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటి అనే అంశాలతో కూడిన ఆసక్తికర కథేంటి అనేది సినిమాలో చూడాలి.

Amaravathiki Ahwanam Movie Review A Spine-Chilling Family Horror Thriller With Strong Emotions

సినిమా ఎలా ఉందంటే?

హారర్ థ్రిల్లర్ జానర్‌లో అనేక సినిమాలు వచ్చాయి. అయినా దర్శకులు కొత్త కొత్తగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అలా దర్శకుడు జీవీకే చేసిన ప్రయత్నమే ఈ సినిమా అని మొదటి సీన్ నుంచే మనకు అర్థమవుతుంది. ప్రతి హారర్ సినిమాలో ఒక హ్యూమన్ ఎమోషన్ ఉంటుంది. అలా ఈ చిత్రంలోనూ ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్‌ను చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. అమరావతి అనే గ్రామాన్ని మొదట్లోనే పరిచయం చేయడంతో అక్కడ ఒక హుక్ ప్రేక్షకులకు తగులుతుంది. ఈ గ్రామం ఏంటి, ఎందుకిలా జరుగుతుంది అనే ఆసక్తిని మొదటనుంచే క్రియేట్ చేశారు. హైదరాబాద్‌కు కథ షిప్ట్ అయినా ప్రేక్షకుడి మదిలో అమరావతి క్యూరియాసిటీ అలాగే ఉండిపోతుంది. ఇక ఈశ్వర్ కుటుంబం మొత్తం అమరావతి గ్రామానికి వెళ్లడంతో అసలు కథలోకి ప్రేక్షకుడు వెళ్తాడు.

అమరావతి గ్రామానికి కథ వెళ్లినప్పటి నుంచి మరింత ఎంగేజింగ్‌గా మూవీ మారుతుంది. రాజేశ్వరి ఎవరు, ఆమెకు జరిగిన అన్యాయం ఏంటి, తమ కుటంబంతో ఆమెకున్న సంబంధం ఏంటి అని ఈశ్వర్ ఆయన కుటుంబ సభ్యులు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. రాజేశ్వరి ఫ్లాష్ బ్యాక్ సీన్స్ సినిమాకే హైలైట్ గా చెప్పుకోవచ్చు. సినిమా క్లైమాక్స్ ముందు కథలో ఓ సూపర్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్యామిలీ ఎమోషన్, మంచి సాంగ్స్, థ్రిల్ చేసే హారర్ అంశాలతో 'అమరావతికి ఆహ్వానం' సినిమా థియేటర్స్‌లో టికెట్ ధరకు పైసా వసూల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.

నటీనటుల ప్రతిభ

కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ చేయడంలో శివ కంఠంనేని ముందుంటారు. ఆయన "అక్కడొకడుంటాడు", "మధురపూడి గ్రామం అనే నేను" వంటి పలు చిత్రాలతో తన నటనతో ఆకట్టుకున్నారు. అమరావతికి ఆహ్వానం సినిమా నటుడిగా శివ కంఠంనేనిని మరో మెట్టు పైకి ఎక్కిస్తుంది. యాక్షన్, సాంగ్స్‌లో కూడా శివ కంఠంనేని ప్రత్యేకత కనిపించింది. రాజేశ్వరి పాత్రలో ఎస్తేర్ నటన ఆకట్టుకుంటుంది. ఆమె కళ్లలోని ఆకర్షణ ఈ పాత్రకు ఎంతో అడ్వాంటేజ్ అయ్యింది. ఒక మంచి క్యారెక్టర్ దొరికితే ఎంతగా మెప్పించగలదో ఎస్తేర్ ప్రూవ్ చేసింది. భానుమతిగా ధన్య బాలకృష్ణ నటన ఈ సినిమాకు మరో ఆకర్షణగా నిలుస్తుంది. ఆమె హౌస్ వైఫ్ గా మెప్పిస్తూనే హారర్ ఎలిమెంట్స్‌లో భయపెట్టారు. భార్గవి పాత్ర సుప్రితకు టైలర్ మేడ్. ఈ తరం అమ్మాయిలు సోషల్ మీడియా పట్ల ఎలాంటి ఉత్సాహం చూపిస్తున్నారో వైరల్ కావాలనే తపన పడుతున్నారో తన నటనతో చూపించింది సుప్రిత. మహేశ్ పాత్రలో హరీశ్ ఆకట్టుకున్నాడు. ఈ కథలోని ప్రతి పాత్రకు ఓ ప్రత్యేకత ఉండటం విశేషం.

సాంకేతికంగా చూస్తే హారర్ చిత్రాల స్పెషలిస్ట్ డీవోపీ ప్రభాకర్ రెడ్డి 'అమరావతికి ఆహ్వానం' చిత్రంతో మరోసారి తన ప్రతిభ చూపించారు. ఆయన ప్రతి విజువల్ ఫీస్ట్‌లా ఉంది. భరద్వాజ్ మ్యూజిక్‌తో మూవీకి లైఫ్ ఇచ్చారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయి. మరోసారి లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యాన‌ర్‌ మంచి చిత్రాలు చేయడంలో తన స్టాంప్ వేసింది. ఈ సినిమాను ప్రేక్షకులు ఫ్యామిలీతో హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయొచ్చు.

రేటింగ్ 2.5/5

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+