రాజశేఖర్ తో అమెజాన్ ప్రైమ్ రూ.60 కోట్ల బ్లాక్ బస్టర్ డీల్
యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ ప్రస్తుతం ఏ చిత్రం చేయడంలేదు. చివరగా వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ కథానాయకుడిగా వచ్చిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రంలో అతిథి పాత్ర పోషించారు. అందులో నటించినందుకు రెండున్నర కోట్ల రూపాయల పారితోషికాన్ని ముట్టచెప్పారు. కెరీర్ అనుకున్న స్థాయిలో ఆశాజనకంగా లేదు. ఇటువంటి సమయంలో డాక్టర్ రాజశేఖర్ కు అమెజాన్ ప్రైమ్ బ్లాక్ బస్టర్ డీల్ తీసుకువచ్చింది. ఒకరకంగా ఇది ఆయనకు అదిరిపోయే ఆఫర్ అని చెప్పొచ్చు.
గరుడవేగ తర్వాత రాజశేఖర్ కు హిట్ రాలేదు. కల్కి పేరుతో క్రైమ్ థ్రిల్లర్ చేసినా ఉపయోగం లేకుండా పోయింది. సినిమా యావరేజ్ గా నిలిచింది. హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దీన్ని తెరకెక్కించారు. తర్వాత శేఖర్, దెయ్యం పేరుతో రెండు సినిమాలు వచ్చినా వాటివల్ల పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. క్యారెక్టర్, ప్రతి నాయకుడి రోల్స్ చేయమని ఆఫర్లు వస్తున్నాయికానీ ఇంకా ఏ విషయం చెప్పడంలేదు.

సరిగ్గా ఇటువంటి సమయంలో అమెజాన్ ప్రైమ్ ఈ యంగ్ మ్యాన్ తో ఓ డీల్ కుదుర్చుకుంది. రూ.60 కోట్ల భారీ బడ్జెట్ తో ఓ భారీ ప్రాజెక్టును తెరకెక్కించబోతున్నారు. ఇందులో రాజశేఖర్ నటిస్తున్నారు. గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో ఇది రూపుదిద్దుకుంటోంది. కథను సిద్ధం చేసిన గ్యారీ అమెజాన్ కు కథ వినిపించగా వారికి నచ్చడంతో ప్రాజెక్టు ఓకే చేశారు.
ఇందులో నటించేందుకు రాజశేఖర్ తో ఒప్పందం కుదిరింది. మరో ఇద్దరు యంగ్ హీరోలు కూడా నటించబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎటువంటి ఆఫర్లు లేకుండా ఉన్న రాజశేఖర్ కు ఒకరకంగా ఇది అద్భుతమైన అవకాశం అంటున్నారు. పారితోషికం కూడా భారీగా వస్తుందని అంచనాలు వేస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.












Click it and Unblock the Notifications