ఒక రాత్రికి అతనితో రెడీ.. ఓపెన్‌గా చెప్పేసిన మహేష్ బాబు హీరోయిన్
Ameesha Patel: సీనియర్ హీరోయిన్ అమీషా పటేల్ 50 ఏళ్ల వయస్సులోనూ తన ఘాటు అందాలతో రెచ్చిపోతూనే ఉంది. ఆమె తెలుగులో పవన్ కల్యాణ్‌తో బద్రి, మహేశ్ బాబుతో నాని సినిమాల్లో అద్భుతంగా నటింది. దక్షిణాదిలో పెద్దగా అవకాశాలు లేకపోయినా బాలీవుడ్‌లో ఎన్నో అవకాశాలను అందుకుంది. ఆమె వ్యక్తిగత జీవితంలో ఎంతో మందితో డేటింగ్ చేసింది. కానీ ఎవరినీ పెళ్లి చేసుకోకుండానే సింగిల్ గానే ఉండిపోయింది. తాజాగా అమీషా పటేల్ తన వ్యక్తిగత జీవితం గురించి చర్చనీయాంశంగా మారారు. సాధారణంగా తన వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచే ఆమె.. తాజాగా ఒక పోడ్‌కాస్ట్‌లో ప్రేమ, క్రష్, వన్ నైట్ స్టాండ్ గురించి కూడా నిస్సంకోచంగా మాట్లాడారు.
రణవీర్ అలహాబాదియా పోడ్‌కాస్ట్‌లో ఆమె తన జీవితం, పని గురించి చర్చించారు. ఈ సందర్భంగా తన సెలబ్రిటీ క్రష్ గురించి అడగగా.. అమీషా వెంటనే స్పందిస్తూ.. తాను పిచ్చిగా ప్రేమించే ఆ నటుడు మరెవరో కాదని, ఆయనే హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ అని వెల్లడించారు. "టామ్ క్రూజ్ నా క్రష్. మీరు ఆయనతో పోడ్‌కాస్ట్ చేసినట్లయితే దయచేసి నన్ను తప్పకుండా ఆహ్వానించండి. నేను చిన్నప్పటి నుంచీ టామ్ క్రూజ్‌ను ఇష్టపడుతున్నాను. నా పెన్సిల్ బాక్స్‌లో, ఫైల్స్‌లో, చివరికి నా గదిలో కూడా ఆయన పోస్టర్‌లు ఉండేవి" అని అమీషా పటేల్ తెలిపారు.

వన్ నైట్ స్టాండ్‌కైనా సిద్ధం!
తన క్రష్‌పై ఉన్న అభిమానాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తూ అమీషా ఇలా అన్నారు. "నేను ఎప్పుడూ సరదాగా చెప్పేదాన్ని, ఆయనే (టామ్ క్రూజ్) ఒకే ఒక్క వ్యక్తి, ఆయన కోసం నేను నా నియమాలన్నింటినీ పక్కన పెట్టగలను. ఆయన కోసం నేను ఏదైనా చేయగలను. మీరు నన్ను అడిగితే, 'నేను ఆయనతో వన్ నైట్ స్టాండ్ చేయగలనా?' అంటే... అవును, నేను చేయగలను" అని స్పష్టం చేశారు. అమీషా పటేల్ టామ్ క్రూజ్‌పై తన అభిమానాన్ని ఇలా బహిరంగంగా చెప్పడం ఇది మొదటిసారి కాదు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఈవెంట్‌లో కూడా, అవకాశం వస్తే తాను టామ్ క్రూజ్‌ను పెళ్లి చేసుకుంటానని ఆమె అన్నారు.
పని విషయంలో చూస్తే, అమీషా పటేల్ చివరిసారిగా 'తౌబా తేరా జల్వా' చిత్రంలో కనిపించారు. ఆ సినిమాను ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు. ప్రస్తుతం ఆమె తన తదుపరి ప్రాజెక్ట్‌ల గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.












Click it and Unblock the Notifications