ఎన్‌టిఆర్ కోసం రంగంలోకి దిగిన అమెరికన్ యాక్షన్ డైరెక్టర్..
ఎన్‌టీఆర్ బాలీవుడ్‌లో నటిస్తోన్న మొదటి చిత్రం వార్ 2. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం ఎన్‌టీఆర్ ఓ పదిరోజులు ముంబై బయలుదేరిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఎన్టీఆర్ ఈ మూవీ షూటింగ్‌లో కూడా పాల్గొన్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా ఉన్నాడు. ఇక, వీరిద్దరి మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌ను ప్రస్తుతం ముంబైలో తెరకెక్కిస్తున్నారు. అయితే, ఇప్పడు ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఈ సినిమాలో ఎన్‌టీఆర్, హృతిక్ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ కోసం, హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్‌ని రంగంలోకి దింపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం హై వోల్టేజ్ యాక్షన్ అండ్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆ యాక్షన్ డైరెక్టర్ మరెవరో కాదు. అమెరికన్ యాక్షన్ డైరెక్టర్ స్పిరో రాజటోస్. ఈయన హాలీవుడ్ విడుదలయిన 'కెప్టెన్ అమెరికా సివిల్ వార్' వంటి చిత్రాలకు స్టంట్ డైరెక్టర్‌గా చేశారు. ఆయనే ఇప్పడు వార్ 2 సినిమాకి పనిచేస్తున్నట్టు బీ టౌన్ వర్గాల్లో వినిపిస్తోన్న టాక్. వీటితోపాటు 'వార్ 2'కి సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ ఆయనే స్పిరో రాజటోస్ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. స్పిరో ఆధ్వర్యంలోనే యాక్షన్ పార్ట్స్ తెరకెక్కనున్నట్టు సమాచారం.

భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న చిత్రం..
ఈ సినిమాను YRF బ్యానర్లో ఆదిత్య రాజ్ చోప్రా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2025 ఆగస్ట్ 14వ రిలీజ్ చేస్తామని ఇప్పటికే మూవీ టీం ప్రకటిచిన విషయం తెలిసిందే. ఇక, ఈ చిత్రంలో ఎన్‌టిఆర్ ఏకంగా గన్స్ పెట్టి యుద్ధం చేయబోతున్నాడని టాక్. ఇప్పడు అమెరికన్ యాక్షన్ డైరెక్టర్ దర్శకత్వంలో కాబట్టి ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి.
కాగా వార్ 2ని డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన గతంలో బ్రహ్మస్త్ర వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు.












Click it and Unblock the Notifications