ఐశ్వర్యరాయ్ కాపురంలో ఆ హీరోయిన్ చిచ్చు..?
గత కొద్దిరోజులుగా ఐశ్వర్యరాయ్ వ్యక్తిగత జీవితం గురించి అనేక కథనాలు వెలువడుతున్నాయి. ఐశ్వర్యరాయ్ తన భర్త,బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌తో విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. 2007లో ఐశ్వర్యరాయ్,అభిషేక్ బచ్చన్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఆరాధ్య అనే పాప కూడా ఉంది. 16 ఏళ్లు బాగానే సాగిన కాపురంలో గత కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అభిషేక్ బచ్చన్ , ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్న సంగతి అందరికి తెలిసిందే.
తాము కలిసే ఉన్నామని విడాకులు తీసుకోవడం లేదని ఐశ్వర్యరాయ్ క్లారిటీ ఇస్తూ ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేసినప్పటికి ఈ పుకార్లు మాత్రం ఆగడం లేదు. అంబానీ ఇంట జరిగిన పెళ్లి సమయంలో కూడా అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యరాయ్ విడాకుల ప్రస్తావన తెర మీదకు వచ్చింది. ఫొటో సెషన్‌లో భాగంగా బచ్చన్ ఫ్యామిలీతో కాకుండా ఐశ్వర్యరాయ్ ఒక్కరే ఫొటోలు దిగడంతో మరోసారి ఈ జంట విడాకుల గురించి చర్చ నడిచింది. ఈ ఘటన తర్వాత ఐశ్వర్యరాయ్ కూతురుతో కలిసి ఒంటిరిగా విదేశాలకు వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది. ముంబై విమానాశ్రయంలో ఐశ్యర్య, ఆరాధ్య మాత్రమే కనిపించడం, అభిషేక్ బచ్చన్ లేకపోవడం మరోసారి ఈ జంట విడాకులు గురించి చర్చకు వచ్చింది.

ఇదే సమయంలో ఐశ్వర్యరాయ్ ఓ వ్యక్తితో క్లోజ్‌గా మూవ్ అవుతోందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఐశ్వర్యరాయ్ జిరాక్ మార్కర్ అనే ఓ డాక్టర్‌తో సన్నిహితంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ స్నేహం ప్రస్తుతం వేరే రిలేషన్‌గా మారిందని కొంతమంది బాలీవుడ్ జనాలు చర్చించుకున్నారు. అయితే అతను ఐశ్వర్యరాయ్ చిన్ననాటి స్నేహితుడని ఆమె సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఓ హీరోయిన్ కారణంగా ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ వైవాహిక జీవితంలో విభేదాలు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది.అభిషేక్ బచ్చన్ లైఫ్‌లోకి మరో మహిళ రావడం వల్లే వీరి మధ్య గొడవలు జరిగినట్టు తెలుస్తోంది.దస్వి సినిమాలో నటి నిమ్రత్ కౌర్‌తో అభిషేక్ బచ్చన్ క్లోజ్‌గా మూవ్ అవుతున్నాడని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
వీరిద్దరూ రిలేషన్‌షిప్ పెట్టుకున్నారని తెలిసి ఐశ్వర్య గొడవ పెట్టుకుందని అంటున్నారు. ఆ తర్వాత వీరి వైవాహిక బంధంలో సమస్యలు మరింత తీవ్రమయ్యాయని రీసెంట్ రెడిట్ పోస్టులో ఆరోపించారు.'దస్వి' సినిమా షూటింగ్ సమయంలో నిమ్రత్ కౌర్‌తో అఫైర్ మొదలు పెట్టాక అభిషేక్ బచ్చన్‌కు పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయట.నిమ్రత్ ఆ రిలేషన్‌ను చాలా సీరియస్‌గా తీసుకున్నప్పటికీ, అభిషేక్ తన తప్పును గ్రహించి ఆమెతో సంబంధం తెంచుకున్నాడని రెడిట్ యూజర్ తెలిపాడు. ఆ నటి కారణంగానే ఐశ్వర్యరాయ్ , అభిషేక్ బచ్చన్‌ల మధ్య విభేదాలు జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అటు అభిషేక్ బచ్చన్ కానీ ఇటు ఐశ్వర్యరాయ్ స్పందించలేదు.












Click it and Unblock the Notifications