ఈ తరం హీరోల్లో ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన హీరో

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్2 చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు. హృతిక్ రోషన్ తో కలిసి మల్టీస్టారర్ సినిమాగా దీన్ని చేస్తున్నారు. దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేయబోతున్నారు. వార్ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుండగా, ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ లేదంటే అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేసే అవకాశం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ నటన పరంగా అన్ని హావభావాలు పలికించగలిగిన పరిపూర్ణ నటుడు. ప్రస్తుత తరుణంలో నవరసాలను పలికించే నటులు చాలా అరుదు.

తటపటాయించిన తారక్
హీరోలంతా ఏదో ఒకదానికే పరిమితమవుతున్నారు. అందువల్లే దర్శకుల నుంచి హీరోల వరకు అందరూ తారక్ ను ఇష్టపడతారు. అటువంటి తారక్ కు ప్రస్తుత తరంలో ఇష్టమైన హీరో కూడా ఒకరున్నారు. అతను ఎవరో కాదు.. న్యాచురల్ స్టార్ నాని. నాని అన్నా, నాని నటన అన్నా తారక్ కు బాగా ఇష్టం. రానాతో జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్టీఆర్ కు ప్రస్తుత తరంలో ఇష్టమైన హీరో ఎవరు? అనే ప్రశ్న ఎదురుకాగా చెప్పడానికి ముందు తారక్ తటపటాయించాడు. తర్వాత నాని అని చెప్పాడు. అంతేకాదు.. నానికి ఎన్టీఆర్ భార్య ప్రణతి కూడా పెద్ద ఫ్యాన్. నాని నటించిన పిల్ల జమిందార్ సినిమాను ఎన్నిసార్లు చూసిందో లెక్కేలేదని తారక్ చెప్పాడు.

among this generation heros nani is the favourite hero of junior ntr

సరిపోదా శనివారంతో బ్లాక్ బస్టర్
నాని ప్రస్తుతం హిట్3 చేస్తున్నారు. దీనికి ముందు సరిపోదా శనివారం పేరుతో బ్లాక్ బస్టర్ కొట్టారు. ఇది కూడా రూ.100 కోట్లు రాబట్టింది. అంతకుముందు దసరా సినిమా కూడా రూ.100 కోట్లు రాబట్టిన సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన దేవర రూ.500 కోట్లు రాబట్టింది. దర్శకుడిగా శివ విఫలమయ్యాడంటూ అతనిపై తారక్ అభిమానులు విమర్శలు గుప్పించారు. అయితే ఎన్టీఆర్ తనకున్న మాస్ ఇమేజ్ వల్లే ఈ సినిమాను కనీసం రూ.500 కోట్ల వరకైనా తీసుకురాగలిగాడని అంటారు. ఏదేమైనప్పటికీ తారక్ కు ఇష్టమైన హీరో అంటే తన తాన ఎన్టీఆర్ పేరు చెప్పేవాడు. ప్రస్తుత తరంలో నాని పేరు చెబుతుండటంపై నాని అభిమానులు సంబరపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+