నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు' మూవీ ట్విట్టర్ రివ్యూ ఇదే..!
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో నవీన్ పొలిశెట్టి. ఆయన లేటెస్ట్ మూవీ 'అనగనగా ఒక రాజు' సంక్రాంతి కానుకగా జనవరి 14న గ్రాండ్ గా విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్ సినీ అభిమానుల నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఫుల్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. దాంతో సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. సితారా బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు.
'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ', 'జాతిరత్నాలు', 'మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి' వంటి హ్యాట్రిక్ విజయాల తర్వాత నవీన్ పొలిశెట్టి నుంచి భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం 'అనగనగా ఒక రాజు'. ఈ సినిమాకు స్క్రిప్ట్ అందించింది హీరో నవీన్ కావడం విశేషం. ఆయన రాసిన స్క్రిప్ట్ ను డైరెక్టర్ మారి తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14 న వస్తున్న ఈ సినిమాను ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు.
కథ విషయానికి వస్తే.. సింపుల్ లైన్ తీసుకున్నారు. ఓ పల్లెటూరిలోని జమీందారి కుటుంబానికి చెందిన నవీన్ ఏడు తరాలు గుర్తుండిపోయేలా పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఈ క్రమంలోనే హీరోయిన్ మీనాక్షితో ప్రేమలో పడడం.. ఫ్యామిలీని ఒప్పించడం.. ఇలా మొత్తం గోదావరి అందాలు మధ్య విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సరదాగా గడిచిపోయేలా సినిమాను రూపొందించారు.

ఇక ఈ చిత్రం చాలా సరదాగా.. కంప్లీట్ ఫన్ రైడ్ గా ఉండబోతున్నట్లు సమాచారం. సినిమా గ్రాఫ్ పడిపోతున్న ప్రతి సారీ ఒక అద్భుతమైన కామెడీ ఎపిసోడ్ ఉంటుంది. దీంతో ఈ మూవీని ప్రేక్షకులు ఎక్కడా కూడా బోర్ ఫీల్ కాకుండా ఎంజాయ్ చేస్తారు. ఇక ఈ మూవీలో సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ అలియాస్ బుల్లి రాజు ఉన్నాడు. బుడ్డోడి సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయని టాక్. మూవీ స్టోరీలైన్ సింపుల్ గా ఉన్నా ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాల్ని ఆసక్తికరంగా డిజైన్ చేసినట్లు సమాచారం అందుతోంది.












Click it and Unblock the Notifications