అనన్య పాండే హాట్ వీడియోల కోసం సెర్చ్ చేసిన ఐపీఎల్ స్టార్
Ananya Panday and Sara Ali Khan: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన యంగ్ క్రికెటర్ రియాన్ పరాగ్.. వివాదాల్లో చిక్కుకున్నాడు. ఐపీఎల్ ఫైనల్స్ ముగిసి 24 గంటలు కూడా గడవక ముందే వివాదాలు అతన్ని చుట్టుముట్టాయి.
ఈ ఐపీఎల్ సీజన్‌ను అద్భుతంగా ముగించాడు రియాన్ పరాగ్. 15 మ్యాచ్‌లల్లో 573 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని వ్యక్తిగత అత్యధిక స్కోర్ 84 నాటౌట్. బ్యాటింగ్ యావరేజ్ 52.09. 149.22 స్ట్రైక్ రేట్‌తో మెరుపు ఇన్నింగ్‌లను ఆడాడు. మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు.

జాతీయ జట్టుకు సెలెక్ట్ కావడమే మిగిలివుందనే అంచనాలు వ్యక్తమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కసారిగా వివాదాలకు కేంద్రబిందువు అయ్యాడు రియాన్ పరాగ్. దీనికి కారణాలు లేకపోలేదు. బాలీవుడ్ హీరోయిన్లు అనన్య పాండే, సారా అలీ ఖాన్ హాట్ వీడియోలను అతను యూట్యూబ్‌లో సెర్చ్ చేసినట్లు తేలింది.

రియాన్ పరాగ్‌కు చెందినదిగా చెబుతున్న యూట్యూబ్ సెర్చ్ హిస్టరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన ఓ షార్ట్ వీడియో విపరీతంగా షేర్ అవుతోంది. అతని యూట్యూబ్ సెర్చ్ హిస్టరీలో Ananya Panday hot, Sara Ali Khan hot అనే అక్షరాలు అధికంగా కనిపించాయి ఈ వీడియోలో. దాని తరువాత విరాట్ కోహ్లీ పేరు మీద సెర్చ్ హిస్టరీ కనిపించింది.

ఆన్‌లైన్ గేమింగ్ లైవ్ స్ట్రీమింగ్ సెషన్ సందర్భంగా అతని యూట్యూబ్ సెర్చ్ హిస్టరీ వెలుగులోకి వచ్చింది. తన సెర్చ్ హిస్టరీని హైడ్ చేయడాన్ని మరిచిపోయాడీ డాషింగ్ బ్యాటర్. కనీసం స్క్రీన్ షేరింగ్ జరిగే సమయంలో కూడా దాన్ని అతను గుర్తించలేకపోయాడు. ఫలితంగా అవన్నీ లైవ్ స్ట్రీమింగ్ అయ్యాయి.
Search history of riyan Parag
— ً (@KohliMyHeart) May 27, 2024
"Sara ali khan hot"
"Virat Kohli"
"Ananya Pandey Hot" pic.twitter.com/CW49IwqldH












Click it and Unblock the Notifications