అతనికి సర్వస్వం అర్పించుకున్నా కానీ - స్టార్ హీరో కూతురు

బాలీవుడ్ యంగ్ హీరోయిన్స్ లిస్ట్‌లో అనన్య పాండే కూడా ఒకరు. బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురుగా ఎంట్రీ ఇచ్చిన అనన్య పాండే , అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. జీరో సైజ్ బ్యూటీ పేరుతో అనన్య పాండే ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ''స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'' సినిమా అనన్య పాండే కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది అమ్మడు. తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ''లైగర్'' సినిమాలో హీరోయిన్‌గా నటించింది.

ఈ సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనన్య పాండే తన వ్యక్తిగత విశేషాలతో పాటు, సినిమా విషయాలను కూడా వెల్లడిస్తుంటుంది. ఇక అమ్మడుకు లవ్ స్టోరీల కూడా ఎక్కువగానే ఉన్నాయి. అనన్య పాండే గతంలో ఇషాన్ ఖత్తర్, కార్తిక్ ఆర్యన్ వంటి హీరోలతో డేటింగ్ చేసింది. ఆశికీ 2 హీరో ఆదిత్యరాయ్ కపూర్‌తో కూడా అనన్య పాండే రిలేషన్‌లో ఉందనే వార్తలొచ్చాయి. దీనికి తగ్గట్టుగానే వీరిద్దరు కలిసున్న ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాయి. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఆదిత్యరాయ్ కపూర్‌‌కు బ్రేకప్ చెప్పింది ఈ బ్యూటీ.

Ananya Pandey open comments breakup with Aditya Roy Kapur

కొద్ది నెలల నుంచి వీరిద్దరు కలిసున్న ఫొటో ఒక్కటి కూడా బయటకు రాలేదు. దీంతో వీరిద్దరు వీడిపోయారనే అంతా భావిస్తున్నారు. తాజాగా తన బ్రేకప్‌పై ఓపెన్ కామెంట్స్ చేసింది. బ్రేకప్ తర్వాత తన ఎక్స్-బాయ్ ఫ్రెండ్ ఫొటోల్ని తగలబెట్టానని, ఫొటోలు అలా కాలుస్తూ ఉంటే చాలా బాధ తగ్గిందని వెల్లడించింది. రిలేషన్ షిప్‌లో తను చాలా కాంప్రమైజ్ అయ్యానని, కానీ చెడ్డ వ్యక్తుల పట్ల మరీ అంత మంచిగా ఉండాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది.

తను రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు భాగస్వామిలో కేవలం మంచిని మాత్రమే చూశానని, అతడి కోసం ఎన్నో విషయాల్లో కాంప్రమైజ్ అయ్యానని, తననుతాను మార్చుకున్నానని తెలిపింది. మనల్ని మనం పూర్తిగా అర్పించుకున్నప్పుడే ప్రేమకు అర్థం ఉంటుందని, ఇదే సమయంలో ఎదుటి వ్యక్తి నుంచి అది ఆశించడంలో తప్పులేదని అంటోంది.అలా తను భాగస్వామి నుంచి ఆశించినప్పుడు ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకొచ్చింది.ఆదిత్యరాయ్ కపూర్‌ బ్రేకప్‌ తర్వాత మరొకరితో రిలేషన్‌ మెయిన్‌టైన్ చేస్తోంది. వాకర్ బ్లాంకో అనే వ్యక్తితో ఆమె డేటింగ్ చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+