అనసూయ వీడియో వైరల్.. బెడ్‌పై అతని షర్ట్ విప్పుతూ
యాంకర్ అనసూయ అంటే కేవలం ఒక టీవీ యాంకర్ కాదు, ఆమె ఒక ట్రెండ్ సెట్టర్. బుల్లితెరపై తన మాటలతో, అద్భుతమైన డ్రెస్సింగ్ సెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది. 'జబర్దస్త్' షోతో ఆమె సంపాదించిన క్రేజ్ అపారం. ఆ తర్వాత సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి. అనసూయ కేవలం గ్లామర్‌కే పరిమితం కాలేదు, నటనలోనూ తన ప్రతిభను చాటుకుంది. 'రంగస్థలం' సినిమాలో రంగమ్మత్త పాత్రతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత 'క్షణం', 'పుష్ప', 'యాత్ర' 'దర్జా','విమానం','పెదకాపు-1','ప్రేమ విమానం' ,'రజాకార్' వంటి సినిమాలలో విలక్షణమైన పాత్రలు పోషించి, ఒక నటిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ తర్వాత యాంకర్‌గా , హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇలా పలు విభిన్న పాత్రల్లో కనిపిస్తూ మెప్పిస్తోంది. ఆమె కోసమే కొందరు దర్శకులు కథలు రాస్తున్నారంటే..అనసూయ ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందం , అభినయం రెండు ఉన్న అనసూయకు వివాదాలు కూడా కొత్తేం కాదు. బహిరంగంగానే ముద్దులు, హగ్గులు, బికినీలతో రచ్చ చేస్తూ..ట్రోలింగ్ బారిన పడుతున్నారామె. ఇక హీరో విజయ్ దేవరకొండతో వివాదం గురించి అందరికి తెలిసిందే.

తనని విమర్శించిన వారికి అదే రీతిలో ధీటుగా సమాధానం కౌంటరిస్తుంటుంది ఈ హ్యాట్ బ్యూటీ. అనసూయ ఏం చేసిన కూడా సంచలనమే అన్నట్టుగా ఉంటోంది. 40 ఏళ్ల వయస్సులో కూడా సూపర్ హాట్‌గా కనిపిస్తూ అభిమానులను అలరిస్తుంది. గ్లామర్‌గా కనిపించడానికి అనసూయ తెగ కష్టపడుతుంటుంది. ఫిజిక్ మెయిన్‌టైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా అవాల్సిందే. ఇక సోషల్ మీడియాలో అనసూయ చేసే రచ్చ అంతా ఇంతా కాదు.
ఇదిలా ఉంటే తాజాగా అనసూయ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్నాళ్లు తెలుగు సినిమాలపై ఫోకస్ పెట్టిన అనసూయ ఇప్పుడు తమిళ పరిశ్రమపై దృష్టి పెట్టింది. ఆమె నటించిన 'ఊల్ఫ్' (Wolf) చిత్రం త్వరలోనే తెలుగు, తమిళం, కన్నడ భాషలలో విడుదల కానుంది. ఈ సినిమాలో ప్రభుదేవా , రాయ్ లక్ష్మీ, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ప్రభుదేవా ఇంటికి వచ్చిన ముగ్గురు లేడీస్‌తో రొమాన్స్ సన్నివేశాలు యూత్‌లో హీట్ పుట్టిస్తున్నాయి. వారిలో ఒకరిగా అనసూయ కనిపించారు. చీరలోనే తనదైన అందంతో ఆకట్టుకున్నారు అనసూయ. దీంతో అనసూయ అభిమానులు, ముఖ్యంగా తమిళ ప్రేక్షకులు ఆమె కోలీవుడ్ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications