అనసూయ ఏంట్రా ఇలా చూపిస్తోంది..!
ఇటీవల కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాను ఓ సాధనంగా వాడుతున్నారనే విషయం అందరికి తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఈజీగా రీచ్ కావొచ్చనే అభిప్రాయం చాలామంది సెలబ్రిటీల్లో నెలకొంది. అయితే కొంతమంది సెలబ్రిటీలు ఈ సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్‌ను బయటపెడుతున్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వారిలో యాంకర్ అనసూయ కూడా ఒకరు.
న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ తరువాత యాంకర్‌గా , హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇలా పలు విభిన్న పాత్రల్లో కనిపిస్తూ మెప్పిస్తోంది. ఆమె కోసమే కొందరు దర్శకులు కథలు రాస్తున్నారంటే..అనసూయ ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందం , అభినయం రెండు ఉన్న అనసూయకు వివాదాలు కూడా కొత్తేం కాదు. బహిరంగంగానే ముద్దులు, హగ్గులు, బికినీలతో రచ్చ చేస్తూ..ట్రోలింగ్ బారిన పడుతున్నారామె. ఇక హీరో విజయ్ దేవరకొండతో వివాదం గురించి అందరికి తెలిసిందే.

తనని విమర్శించిన వారికి అదే రీతిలో ధీటుగా సమాధానం కౌంటరిస్తుంటుంది ఈ హ్యాట్ బ్యూటీ. అనసూయ ఏం చేసిన కూడా సంచలనమే అన్నట్టుగా ఉంటోంది. 38 ఏళ్ల వయస్సులో కూడా సూపర్ హాట్‌గా కనిపిస్తూ అభిమానులను అలరిస్తుంది. గ్లామర్‌గా కనిపించడానికి అనసూయ తెగ కష్టపడుతుంటుంది. ఫిజిక్ మెయిన్‌టైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా అవాల్సిందే. తాజాగా జిమ్‌లో ఎక్స్‌సైజ్ చేస్తున్న వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో వర్కవుట్ చేస్తూ అనసూయ చెమటలు కక్కేస్తుంది.
చాలా కష్టసాధ్యమైన కసరత్తులు చేయడం కనిపించింది. కష్టంగా ఉన్నప్పటికీ కూడా అనసూయ తన ఎక్స్‌సైజ్‌లను కొనసాగించింది. నాజుగ్గా కనిపించడానికి జిమ్‌లో అనసూయ పడుతున్న కష్టాలను చూసిన నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అనసూయ జిమ్ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్సందిస్తున్నారు. ఏంట్రా అనసూయ ఇలా చూపిస్తోందని కామెంట్ చేస్తూంటే..మరికొందరు ఆంటీ నీకెందుకు జిమ్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అనసూయ జిమ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications