చిన్మయికి అనసూయ కౌంటర్..మీరు వాటిని చూపించొచ్చు కదా..!

సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సింగర్‌గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా చిన్మయికి మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా హీరోయిన్ సమంతకు చిన్మయి ఇచ్చిన డబ్బింగ్‌తోనే ఆమె స్టార్ హీరోయిన్‌గా మారిందంటే అతిశేయోక్తి కాదు. ఇదే సమయంలో చిన్మయి సైతం తన వ్యక్తిగత వ్యాఖ్యాలతో నిత్యం వివాదాలతో సావాసం చేస్తుంటుంది. లైంగిక వేధింపుల గురించి చిన్మయి పెద్ద పోరాటమే చేస్తోంది. అత్యాచారాలు, లైంగిక వేధింపులు గురించి మొదట స్పందించే సెలబ్రిటీ చిన్మయినే. ఏపీలో ఇటీవల బాలికపై జరిగిన అత్యాచారంపై కూడా ఆమె రియాక్ట్ అయ్యారు.

ఇదిలా ఉంటే ఇటీవల చిన్మయి అనసూయపై పరోక్షంగా కామెంట్స్ చేశారు. అనసూయ ఓ షోలో చిన్న పిల్లలతో లిప్ లాక్ పెట్టించుకున్న వీడియో వైరల్‌గా మారింది. దీనిపై చిన్మయి స్పందిస్తూ..అనసూయపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనసూయ పేరు చెప్పకుండానే ఆమెపై కామెంట్స్ చేశారు. .ఇలా చిన్న పిల్లలతో ముద్దులు పెట్టించుకోవడం ఏంటి ఇలా ముద్దులు పెట్టించుకోవటం వినోదమా పైగా అక్కడున్న వారందరూ చప్పట్లు కొడుతున్నారు అంటూ మండిపడ్డారు.

anasuya counter to singer chinmayi

పిల్లల ద్వారా ఇలాంటివి చేయటం వారిపై తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయంటూ చిన్మయి మండిపడ్డారు. తాజాగా ఈ ఇష్యూపై అనసూయ సైతం రియాక్ట్ అయ్యారు. చిన్నపిల్లలతో ఇలాంటి షోలు చేయడం ఎంటర్టైన్మెంట్ అని కొందరు భావిస్తారు, మరికొందరు భావించరు. ఎవరి ఇష్టం వారిది కానీ నేను కూడా నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నానని తెలిపారు.అయినా పిల్లలకు ఇలాంటి షోలు ఎవరు చూపించమన్నారు.వారికోసం కార్టూన్ ఛానల్ ఉన్నాయి కదా వాటిని చూపించొచ్చు అంటూ చిన్మయికి అనసూయ కౌంటరిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+