వామ్మో అనసూయలో ఈ యాంగిల్ కూడా ఉందా..!
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న వారి పేర్లలో అనసూయ కూడా ఒకరు. వివాదాలతో కూడా నిత్యం సహవాసం చేస్తూనే ఉంది.అనసూయ ఏం చేసిన, ఏం మాట్లాడిన సంచలనమే అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇక సోషల్ మీడియాలో అనసూయ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అనుసూయకు జబర్దస్త్ మంచి క్రేజ్‌ను సంపాదించి పెట్టింది.
జబర్దస్త్ ద్వారా వచ్చిన ఫేంతో సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. క్షణం, రంగస్థలం,కథనం, విమానం , పుష్ప, కిలాడి మొదలగు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. రంగస్థలం సినిమా తరువాత అనసూయ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది.హీరోయిన్లతో సమానంగా అనసూయ క్రేజ్ ఉందంటే.. ఆమె ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

సోషల్ మీడియాలో చెక్కుచెదరని అభిమానగణం ఆమె సొంతం. అనసూయకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఈ హ్యాట్ బ్యూటీ 38 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ స్టార్స్‌కు గట్టి పోటినిస్తోంది. ఫిజిక్ మెయిన్‌టైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా అవాల్సిందే. చీర కట్టిన, స్కార్ట్ వేసిన అది అనసూయకే చెల్లింది. అందం,నటనతో చాలామంది అభిమానులను సంపాధించుకున్న అనసూయ.
అమ్మడు అందాలకు సోషల్ మీడియా సైతం అల్లాడిపోతుంది. అయితే ఇటీవల అనసూయ కాస్తా బొద్దుగా కనిపిస్తోంది. అయినప్పటికి తనదైన అందంతో అదరగొడుతోంది. అనసూయ తాజాగా ఓనమ్ సెలబ్రేషన్స్ జరుపుకున్న ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అనసూయ తన ఒక్కతే కాకుండా మరో ఫ్రెండ్‌తో సహా ఈ ఓనమ్ సెలబ్రేషన్స్ జరుపుకుంది. భర్త భరద్వాజ్ పిల్లలు కూడా ఈఫోటోల్లో ఫెస్టివల్ మూడ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. చీరలో పద్దగా కనిపిస్తూ హొయలొలికించింది. చీరలో అనసూయ అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అనసూయలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అనసూయ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications