అనసూయను అనే ముందు మీ పొట్టలు చూసుకోండ్రా..!
యాంకర్ అనసూయ అంటే కేవలం ఒక టీవీ యాంకర్ కాదు, ఆమె ఒక ట్రెండ్ సెట్టర్. బుల్లితెరపై తన మాటలతో, అద్భుతమైన డ్రెస్సింగ్ సెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది. 'జబర్దస్త్' షోతో ఆమె సంపాదించిన క్రేజ్ అపారం. ఆ తర్వాత సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి. అనసూయ కేవలం గ్లామర్‌కే పరిమితం కాలేదు, నటనలోనూ తన ప్రతిభను చాటుకుంది. 'రంగస్థలం' సినిమాలో రంగమ్మత్త పాత్రతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత 'క్షణం', 'పుష్ప', 'పుష్ప'-2 'యాత్ర' వంటి సినిమాలలో విలక్షణమైన పాత్రలు పోషించి, ఒక నటిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ తర్వాత యాంకర్‌గా , హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇలా పలు విభిన్న పాత్రల్లో కనిపిస్తూ మెప్పిస్తోంది. ఆమె కోసమే కొందరు దర్శకులు కథలు రాస్తున్నారంటే..అనసూయ ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందం , అభినయం రెండు ఉన్న అనసూయకు వివాదాలు కూడా కొత్తేం కాదు. బహిరంగంగానే ముద్దులు, హగ్గులు, బికినీలతో రచ్చ చేస్తూ..ట్రోలింగ్ బారిన పడుతున్నారామె. ఇక హీరో విజయ్ దేవరకొండతో వివాదం గురించి అందరికి తెలిసిందే.

తనని విమర్శించిన వారికి అదే రీతిలో ధీటుగా సమాధానం కౌంటరిస్తుంటుంది ఈ హ్యాట్ బ్యూటీ. అనసూయ ఏం చేసిన కూడా సంచలనమే అన్నట్టుగా ఉంటోంది. 40 ఏళ్ల వయస్సులో కూడా సూపర్ హాట్‌గా కనిపిస్తూ అభిమానులను అలరిస్తుంది. గ్లామర్‌గా కనిపించడానికి అనసూయ తెగ కష్టపడుతుంటుంది. ఫిజిక్ మెయిన్‌టైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా అవాల్సిందే. ఇక సోషల్ మీడియాలో అనసూయ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా అనసూయ చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈటీవీ స్థాపించి 30 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా అనసూయ స్పెషల్ ఫర్ఫామెన్స్ ఇచ్చింది.
అయితే ఈ వీడియోలో అనసూయ కాస్త చబ్బీగా కనిపించింది. ఆమె కట్టిన చీర కూడా అంతగా ఆకట్టుకున్నట్టు అనిపించలేదు. దీంతో కొందరు నెటిజన్లు తమ నోటికి పని చేశారు. అనసూయ ఏంటి ఇలా అయిపోయిందని కొందరు కామెంట్ చేయగా, అనసూయ పొట్ట చూడండి ఎలా ఉందో అంటూ మరి కొందరు కామెంట్ చేశారు. అయితే అనసూయ కాస్త లావుగా ఉన్న మాట వాస్తవమే కానీ, ఆమెను ఈ రకంగా విమర్శించే హక్కు వారికి ఎవరిచ్చారు. అనసూయను అనే ముందు తమను తాము ఒక్కసారి ఎలా ఉన్నారో చూసుకుంటే బాగుంటుందేమో.












Click it and Unblock the Notifications