నీకు పీరియడ్స్‌ వస్తాయా? నటికి యాంకర్ పిచ్చి ప్రశ్న

టెలివిజన్ రంగంలో జబర్దస్త్ షో సరికొత్త ట్రెండ్ సృష్టించిందనే చెప్పాలి. ప్రేక్షకులకు సరికొత్త కామెడీని అందించడంలో జబర్దస్త్ షో సూపర్ సక్సెస్ అయింది. జబర్దస్త్ ద్వారా చాలామంది ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చారు. నాగబాబు, రోజా వంటి వారు కూడా జబర్దస్త్ షో ద్వారా తమ పాపులారిటీని మరింత పెంచుకున్నారు. తాను ఎమ్మెల్యేగా గెలవడానికి జబర్దస్త్ షో కూడా ఓ కారణమని రోజా చెప్పారంటే ఆ షో ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇక ఈ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచియమైన వారి సంఖ్య వందల్లోనే ఉంటుంది. గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్, షకలక శంకర్ వంటి వారు జబర్దస్త్ షోతో వచ్చిన గుర్తింపుతో సినిమాల్లో కూడా నటించారు. ఇక సుడిగాలి సుధీర్ అయితే జబర్దస్త్ షోతో బుల్లితెర మెగాస్టార్‌గా మారిపోయాడు. సుధీర్ ఇప్పుడు సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. ఇక షోలో యాంకరింగ్ చేసిన అనసూయ, రష్మీ కెరీర్ ఎలా దూసుకుపోతుందో అందరికి తెలిసిందే.

anchor asked Jabardasth actress Priyanka Singh crazy questions

జబర్దస్త్ షోతో గుర్తింపు పొందిన వారిలో ప్రియాంక సింగ్ కూడా ఒకరు. సాయిగా జబర్దస్త్‌లో అడుగుపెట్టి ఆ తర్వాత అమ్మాయిగా మారి మరింత పాపులారిటీని సంపాదించుకుంది. జబర్దస్త్ షోతో వచ్చిన గుర్తింపుతో రియాల్టీ షో అయిన బిగ్‌బాస్‌లో అడుగుపెట్టింది. దాదాపు 90 రోజులు బిగ్‌‌బాస్‌ హౌస్‌లో ఉండి ఫ్యాన్ ఫాలోయింగ్‌ విపరీతంగా పెంచుకుంది.

ప్రియాంక సింగ్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్య్వూ ఇచ్చింది. యాంకర్‌ శివ ప్రియాంక సింగ్‌ను చేసిన ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్‌గా మారింది. శివ పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగడంతో తనదైనశైలిలోనే అతనికి ప్రియాంక సింగ్ సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం నువ్వు పూర్తిగా అమ్మాయివి.. అమ్మాయిలకి ఎలా ఉంటుందో నీకు అలానే ప్రతి నెల పీరియడ్స్ వస్తాయా అంటూ ప్రియాంక సింగ్‌ను యాంకర్ శివ ప్రశ్నిస్తాడు.

దీనిపై ఆమె ఒక్కసారిగా ఫైర్ అయింది. ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడిగితే రానని ముందే చెప్పానని, అయినా ఇలాంటి తిక్క ప్రశ్నలు అడుగుతావు ఏంటని అతన్ని ప్రశ్నించింది. ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్లది. నాకు ఇది అవుతుంది, ఇది అవ్వదు.. నాకు ఇది చేయాలని ఉందని.. అన్నీ కెమెరా ముందు పెట్టాలా..? అంటూ గట్టిగా యాంకర్‌కి వార్నింగ్ ఇచ్చింది. కెమెరా ఆఫ్‌లో ఉంటే నీకు సరిగ్గా చెబుతా అంటూ ప్రియాంక సింగ్‌ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+