టీడీపీ యంగ్ ఎమ్మెల్యేతో రిలేషన్‌పై నోరువిప్పిన యాంకర్ ప్రదీప్..
ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితుడే. బుల్లితెరపై పలు కార్యక్రమాలకు యాంకరింగ్ చేసి తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. అబ్బాయిలలో యాంకర్స్ గా ఉన్నవారిలో ప్రదీప్ టాప్ లో ఉంటాడు అనడంలో సందేహం లేదు. యాంకరింగ్ చేస్తూనే అటు వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇప్పటికే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా.. అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ చిత్రం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది.
ఇక ఇప్పుడు మళ్లీ కొంచెం గ్యాప్ తీసుకొని 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నితిన్- భరత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో దీపికా పిల్లి హీరోయిన్ గా నటిస్తుండగా.. ఏప్రిల్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పైగా పవన్ కళ్యాణ్ ఫస్ట్ సినిమా టైటిల్ కావడంతో మంచి అంచనాలే నెలకున్నాయి.

మరోవైపు రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది మూవీ యూనిట్. ఈ క్రమంలోనే ప్రదీప్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. అయితే మూడు పదుల వయసు దాటినా కూడా ప్రదీప్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో.. ఆయన పెళ్లి గురించి ఎప్పటికప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. గత కొంతకాలంగా ప్రదీప్.. ఓ టీడీపీ ఎమ్మెల్యేతో ప్రేమాయణం నడుపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వారిద్దరికీ సంబంధించిన ఫోటోలు సైతం వైరల్ అయ్యాయి.
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రదీప్ కి ఇదే ప్రశ్నా ఎదురవగా.. పెళ్లి వ్యవహారంపై నోరు విప్పారు. పెళ్లికి అంటూ స్పెషల్ గా ప్లాన్ చేసుకోలేదు. లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకున్నాను. కష్టపడుతున్నాను. నేను పెట్టుకున్న టార్గెట్స్, నేను కన్న కలలు అన్ని నిజం అయ్యేవరకు పెళ్లి గురించి ఆలోచించాలనుకోలేదు. వాటికి కొద్దిగా టైమ్ పడుతూ వచ్చింది. అయినా అనుకున్న టైమ్ లోనే అన్ని అవుతాయని నమ్ముతున్నాను. ఈ మధ్యలో చాలామందితో నా పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి. ఒక పొలిటీషియన్ తో నా పెళ్లి అని వచ్చిన వార్తలు నేను కూడా విన్నాను. అందులో నిజం లేదు. ఎవరో ఒకరితో పెళ్లి అవుతుందని చెప్పడం సరదా అయిపోయిందని వ్యాఖ్యానించారు.
అయితే కూటమి ప్రభుత్వానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేతో రెండు సంవత్సరాల నుంచి ప్రదీప్ ప్రేమలో ఉన్నాడని అంటున్నారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించిన తర్వాత ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పోటీచేసిన మొదటిసారి ఓటమి పాలవ్వగా.. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
-
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
'పెద్ది' సినిమా వాయిదా..? నిర్మాత సంచలన ప్రకటన.. -
ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ బిలియనీర్‌గా రాజభోగాలు -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !!












Click it and Unblock the Notifications