ఎరుపు రంగు దుస్తుల్లో హొయలొలికిస్తున్న రష్మీ
బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ ద్వారా యాంకర్ రష్మీ భారీ పాపులారిటీ దక్కించుకుంది. ఈ ఒడియా భామ ఎపిసోడ్ ఎపిసోడ్ కి తన డ్రెస్సింగ్ స్టైల్, అందచందాలతో ప్రేక్షకులను కళ్లు తిప్పుకోనీయకుండా చేస్తుంది. కెరీర్ ప్రారంభంలోనే వెండితెరపై హీరోయిన్ గా పలు సినిమాలో నటించింది. హీరోయిన్ గా ఆశించిన రీతిలో విజయం దక్కలేదు. జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకుంది.
ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ హాట్ బ్యూటీగా కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. హాట్ సీన్స్, ఇంటిమేట్ సీన్స్‌లో రెచ్చిపోయి నటిస్తోంది. మగాళ్లను ఇట్టే ఆకట్టుకుంటుంది. అడపాదడపా సినిమాల్లో నటిస్తుండటంతోపాటు షోలకు హోస్టింగ్ చేస్తూ బిజీగా ఉంటుంది. సోషల్ మీడియాలోనూ రష్మీ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోషూట్లను ఈ ముద్దుగుమ్మ షేర్ చేస్తుంటుంది.

కారులో రెడ్ కలర్ డ్రెస్ తో డిఫరెంట్ స్టిల్స్ ఇస్తూ కుర్రాళ్లను కవ్వించడమేకాదు.. హాట్ రష్మీ అంటూ.. రెడ్ చిల్లీలా భలే హాట్ గా కనిపిస్తున్నావ్ అమ్మడు.. సో బ్యూటిఫుల్.. అంటూ అభిమానుల నుంచి కామెంట్లు అందుకుంటోంది. ఎక్స్ ట్రా జబర్దస్త్ యాంకర్ గా చేస్తున్న సమయంలోనే సుడిగాలి సుధీర్ కు జోడీగా పలు కార్యక్రమాలు నిర్వహించింది. కొన్ని సంవత్సరాల నుంచి సుడిగాలి సుధీర్ -రష్మి మంచి జంటగా పేరు తెచ్చుకోవడమే కాకుండా నేడో, రేపో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చేవి. అయితే వారిద్దరూ ఈ వార్తలు కొట్టేసేవారు. తాము కేవలం మంచి స్నేహితులమేనని, అంతకుమించి తమ మధ్య ఏదీ లేదని చెప్పేవారు. నిజ జీవితంలో వీరిద్దరు పెళ్లి చేసుకుంటారా? లేదా? అనే ఉత్కంఠ మాత్రం అభిమానుల్లో నెలకొంది.












Click it and Unblock the Notifications