అతనితో పెళ్లిపీటలెక్కనున్న యాంకర్ రష్మీ
బుల్లితెర యాంకర్ రష్మీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన రష్మీ.. సినిమాల్లో సరైన అవకాశాలు దక్కకపోవడంతో బుల్లితెర మీద యాంకర్ అవతారం ఎత్తింది. జబర్థస్త్ షోలో యాంకర్‌గా కనిపించిన తరువాత రష్మీ జాతకమే మారిపోయింది. జబర్థస్త్ షో రష్మీకి ఫుల్ పాపులారిటీని తెచ్చిపెట్టింది. ముఖ్యంగా రష్మీ -సుడిగాలి సుధీర్‌ల మధ్య కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.
టీవీ రంగంలో రష్మీ -సుడిగాలి సుధీర్‌లపెయిర్ సంచలనం సృష్టించారని అని చెప్పాలి. వీరిద్దరూ కలిసి కనిపిస్తే చాలు ఆ షో సూపర్ హిట్ అనే రేంజ్‌కి వెళ్లిపోయిందంటే వీరి క్రేజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ షోల ద్వారా వచ్చిన పాపులారిటీతో వీరిద్దరు పలు సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకున్నారు. అయితే వీరిద్దరు ప్రేమించుకుంటున్నారని చాలామంది అభిప్రాయపడుతున్నారు. షూటింగ్ తరువాత వీరిద్దరు కలుసుకున్న వీడియోలు చాలానే వైరల్ అయ్యాయి.

ఇక రష్మీ -సుడిగాలి సుధీర్‌లు కలిసి షోస్ చేయనప్పటికీ.. ప్రతిరోజు కాల్ చేసి మాట్లాడుకుంటామని వారే స్వయంగా చెప్పడం జరిగింది. అయితే తెర మీద అభిమానులను అలరించడానికే అలా యాక్టింగ్ చేస్తాము తప్పిస్తే..తమ మధ్య ఎలాంటిది లేదని వీరిద్దరు ప్రకటించారు. ఇదిలా ఉంటే రష్మీ గత కొన్నేళ్లుగా ఓ వ్యక్తితో ప్రేమలో ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రియుడుతో ఉన్న ప్రేమను పెళ్లిగా మార్చుకోవాలని రష్మీ భావిస్తుందట.
దీంతో త్వరలోనే రష్మీ పెళ్లిపీటలు ఎక్కనుందని టాక్ వినిపిస్తుంది. అమెరికాకు చెందిన వ్యక్తితో రష్మీ గౌతమ్ పెళ్లి జరగనుందని తెలుస్తోంది. ఇరు కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించడంతో వీరి పెళ్లి ఈ ఏడాది జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలోనే పెళ్లి ప్రకటన కూడా రానుందని తెలుస్తోంది. అయితే తన పెళ్లిపై రష్మి ఇప్పటి వరకు స్పందించింది లేదు. మరీ తన పెళ్లిపై వస్తున్న వార్తలపై రష్మీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
-
ధురంధర్2 సూపరంట..పవన్ కల్యాణ్ సినిమా గురించి నోరు తెరవని మన ‘భజన’ హీరోలు -
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
2007లో సినీ వజ్రోత్సవ వేడుకల్లో చిరంజీవి-మోహన్‌బాబు మాటల యుద్ధం -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
తెలుగులో 100 రోజులు ఆడిన సినిమాల్లో ఈ హీరోదే రికార్డు -
స్టార్ హీరోలున్నా.. కేవలం ఈ విలన్లవల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం












Click it and Unblock the Notifications