హాస్పిటల్ బెడ్‌పై యాంకర్ రష్మి , వాళ్లతో పిచ్చ ఎంజాయ్ చేస్తోన్న సుధీర్
యాంకర్ రష్మి ఇటీవల కాలంలో నిత్యం వార్తాల్లో నిలుస్తున్నారు. లేటెస్ట్ ఫొటో షూట్‌లతో పాటు, తన కామెంట్స్‌తో రష్మి పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన రష్మి.. సినిమాల్లో సరైన అవకాశాలు దక్కకపోవడంతో బుల్లితెర మీద యాంకర్ అవతారం ఎత్తింది. జబర్థస్త్ షోలో యాంకర్‌గా కనిపించిన తర్వాత రష్మి జాతకమే మారిపోయింది.
జబర్థస్త్ షో రష్మికి ఫుల్ పాపులారిటీని తెచ్చిపెట్టింది. బుల్లితెరపై తనకంటూ సపరేటు క్రేజ్‌ను యాంకర్ రష్మి క్రియేట్ చేసుకుంది. ముఖ్యంగా రష్మి -సుడిగాలి సుధీర్‌ల మధ్య కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. టీవీ రంగంలో రష్మి -సుడిగాలి సుధీర్‌లపెయిర్ సంచలనం సృష్టించారని అని చెప్పాలి. వీరిద్దరూ కలిసి కనిపిస్తే చాలు ఆ షో సూపర్ హిట్ అనే రేంజ్‌కి వెళ్లిపోయిందంటే వీరి క్రేజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ షోల ద్వారా వచ్చిన పాపులారిటీతో వీరిద్దరు పలు సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకున్నారు. అయితే వీరిద్దరు ప్రేమించుకుంటున్నారని చాలామంది అభిప్రాయపడుతున్నారు. షూటింగ్ తరువాత వీరిద్దరు కలుసుకున్న వీడియోలు చాలానే వైరల్ అయ్యాయి. ఇక రష్మి -సుడిగాలి సుధీర్‌లు కలిసి షోస్ చేయనప్పటికీ..ప్రతిరోజు కాల్ చేసి మాట్లాడుకుంటామని వారే స్వయంగా చెప్పడం జరిగింది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మి తన కెరీర్ విషయాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలను కూడా అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది. ఇదిలా ఉంటే రష్మి తాను హాస్పిటల్ బెడ్ మీద ఉన్న తన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఈ ఫోటో చూసిన ఆమె అభిమానులు రష్మీకి ఏం జరిగిందో అని కంగారు పడుతున్నారు.అయితే దీనిపై రష్మి వివరణ ఇచ్చారు. 'నేను సర్జరీ కోసం రెడీ అయ్యాను. నా భుజాన్ని సెట్ చేసుకోవాల్సి ఉంది. దాని వల్ల నాకు ఇష్టమైన డాన్స్ చేయలేకపోతున్నాను. దానికి నేను దూరంగా ఉండాల్సి వస్తుంది. ఆ సర్జరీ అయ్యాక పూర్తిగా సెట్ అవుతుంది.. మళ్ళీ నేను డాన్స్ చేయగలుగుతాను' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రష్మి పోస్ట్ వైరల్‌గా మారింది. అయితే రష్మికి సర్జరీ జరిగితే సుధీర్ ఎక్కడున్నడంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.సుధీర్ ప్రస్తుతం జబర్థస్త్ షో మానేసి, ఫ్యామిలీ స్టార్ షో చేస్తున్నారు. ఆషురెడ్డితో పాటు, యాంకర్ స్రవంతితో కలిసి సుధీర్ ఈ షో చేస్తున్నారు.












Click it and Unblock the Notifications