తోటి యాంకర్ల కులాలపై రష్మీ షాకింగ్ కామెంట్స్
యాంకర్ రష్మీ ఇటీవల కాలంలో నిత్యం వార్తాల్లో నిలుస్తున్నారు. లేటెస్ట్ ఫొటో షూట్‌లతో పాటు, తన కామెంట్స్‌తో రష్మీ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన రష్మీ.. సినిమాల్లో సరైన అవకాశాలు దక్కకపోవడంతో బుల్లితెర మీద యాంకర్ అవతారం ఎత్తింది. జబర్థస్త్ షోలో యాంకర్‌గా కనిపించిన తరువాత రష్మీ జాతకమే మారిపోయింది. జబర్థస్త్ షో రష్మీకి ఫుల్ పాపులారిటీని తెచ్చిపెట్టింది. బుల్లితెరపై తనకంటూ సపరేటు క్రేజ్‌ను యాంకర్ రష్మీ క్రియేట్ చేసుకుంది.
ఇక రష్మీ -సుడిగాలి సుధీర్‌ల మధ్య కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. టీవీ రంగంలో రష్మీ -సుడిగాలి సుధీర్‌లపెయిర్ సంచలనం సృష్టించారని అని చెప్పాలి. వీరిద్దరూ కలిసి కనిపిస్తే చాలు ఆ షో సూపర్ హిట్ అనే రేంజ్‌కి వెళ్లిపోయిందంటే వీరి క్రేజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే సుధీర్ సినిమాల్లో హీరోగా చేయడంతో బుల్లితెరకు దూరం అయ్యాడు. సుధీర్ లేకపోవడంతో రష్మీ హవా కూడా కాస్తా తగ్గింది.

దీనికి తోడు ఢీ షో నుంచి కూడా రష్మీ తప్పుకుంది. అయినప్పటికీ రష్మీ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మీ తన కెరీర్ విషయాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలను కూడా అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది. ఇదిలా ఉంటే రష్మీకి తెలుగు మాట్లాడటం పెద్దగా రాదనే విషయం అందరికి తెలిసిందే.

ఇదిలా ఉంటే రష్మి జంతు ప్రేమికురాలనే విషయం అందరికి తెలిసిందే. కరోనా సమయంలో కూడా ఆమె రోడ్డు మీద ఉన్న జంతువులకు ఆహారం అందించి తన ఉదారతను చాటుకుంది. జంతువులను ఎవరైనా హింసిస్తే అదే రీతిలో ఫైర్ అయ్యేదామె. దీనిపై ఆమె పెద్ద యుద్దమే చేసింది. తాజాగా ఈ విషయంపై రష్మీ నెటిజన్లతో పెద్ద గొడవకు దిగింది.

ఓ నెటిజన్ రష్మీ కులంపై కామెంట్ చేశాడు. రష్మీ బ్రాహ్మణ కులానికి చెందిన వారు. చిన్నప్పటి నుంచి ఆమె కులంలో శాకాహారం అలవాటు చేశారు. మాంసం ఎలాగూ తినకూడదు కాబట్టి జంతువులపై ప్రేమ ఉన్నట్లు నటిస్తోంది. తాను తినే ఫుడ్ గొప్ప అని అందరి మీద రుద్దడానికి జంతువులపై ప్రేమ ఉన్నట్లు నటిస్తోందని కామెంట్ చేశాడు. దీనిపై రియాక్ట్ అయిన రష్మీ..నేను నా కులంలో పుట్టినందుకు గర్వపడుతున్నానని తెలిపింది. అయితే నా కులానికి జంతువులపై ప్రేమకి ఎలాంటి సంబంధం లేదని రష్మీ క్లారిటీ ఇచ్చింది.

దయచేసి కులం టాపిక్ తీసుకురావద్దని వేడుకుంది.కానీ నెటిజన్లు పదేపదే ఆమె కులాన్ని ప్రస్తావించారు. మరో నెటిజన్ ఇతర కులాల్లో మీ కన్నా ట్యాలెంట్ ఉండి రాత్రి పగలు కష్టపడే వాళ్లు ఉన్నారు. వాళ్ళకి మీకు మించిన అవకాశాలు రావాలి. కానీ నీతోపాటు, అనసూయ, శ్యామల, శ్రీముఖి, వర్షిణి, విష్ణుప్రియ, మంజూష లాంటి యాంకర్స్ అంతా ఎక్కువ మంది బ్రాహ్మణ, కమ్మ కులానికి చెందిన వారే కాబట్టే మీకు అవకాశాలు వస్తున్నాయంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
దీనిపైరష్మీ ఘాటుగా స్పందించింది. వెళ్లి వాళ్ళందరి క్యాస్ట్ సెర్టిఫికెట్స్ చెక్ చేసుకోండంటూ ఆ నెటిజన్‌కు రిప్లై ఇచ్చింది. ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. మీరు చెప్పిన వాళ్లంతా హార్డ్ వర్క్ చేసి ఈ స్థాయికి వచ్చారు. కులం వల్ల కాదు. పైగా మేమంతా టీవీల్లో సక్సెస్ అయ్యాం. సినిమాల్లో కాదు. మీరు చెప్పినట్టు కులం వల్లే అవకాశాలు వచ్చేలా ఉంటే మేము సినిమాల్లో కూడా సక్సెస్ అయి ఉండాలి కదా అంటూ ఆ నెటిజన్‌కు రష్మీ కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications