20 ఏళ్ల కెరీర్ ..ఆ ఒక్క మాటతో మటాష్
తెర మీద ఎంతోమంది హీరో, హీరోయిన్లు వచ్చారు వెళ్లిపోయారు. కాని బుల్లితెర మీద మాత్రం గత 20 ఏళ్లుగా సుమ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు . హీరోయిన్‌గా కెరీర్ మొదలుపెట్టిన సుమ తరువాత యాంకర్ అవతారం ఎత్తారు. తెలుగు అమ్మాయి కాకపోయినప్పటికీ.. తెలుగు అనర్గళంగా మాట్లాడటంలో సుమ దిట్ట. తెలుగు ప్రముఖ టీవీ ఛానెల్స్ అన్నింటిలోనూ సుమకు సంబంధించిన షోలు నడుస్తున్నాయంటే ఆమె ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
సుమ వల్ల కొన్ని ఛానెల్స్ టీఆర్పీ రేటింగ్స్ కూడా పెరుగుతున్నాయంటే అతిశేయోక్తి కాదనిపిస్తుంది. ఇక తెలుగు హీరోలందరికి సుమనే ఫేవరేట్ యాంకర్. సుమ ఉంటే సినిమా ఈవెంట్స్‌లో నిండుతనంగా ఉంటుందని పలువురు భావిస్తుంటారు. మెజార్టీ సినిమా ఈవెంట్స్‌ను ఆమె కవర్ చేస్తున్నారు. సుమ ఉంటే అభిమానుల్లో కూడా ఎక్కడా లేని జోష్ వస్తుంటుంది.

అయితే తాజాగా సుమ చేసిన పని ఆమెను వార్తల్లో నిలిచేలా చేసింది. మీడియా ప్రతినిధులపై సుమ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. బుధవారం రాత్రి జరిగిన 'ఆదికేశవ' సినిమా ఈవెంట్‌కి సుమ యాంకర్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో మీడియా సంస్థల రిపోర్టర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ మీడియా వాళ్ళు స్నాక్స్‌ని కూడా భోజనం చేసినట్టుగా చేస్తున్నారు. అంటూ వాళ్ళ పైన ఒక సెటైరికల్ కామెంట్ చేయడం జరిగింది.
మీడియా మిత్రులకు సారీ చెప్పిన Suma Kanakala గారు 👍#sumakanakala pic.twitter.com/8I9pUVUMmH
— Kiran Mahesh (@kiranmahesh026) October 25, 2023
తమపై సుమ చేసిన కామెంట్స్‌పై ఓ రిపోర్టర్ గట్టిగానే సీరియస్ అయ్యారు. మీడియాను మీరు అలా అనడం సరైంది కాదని .. మీ యాంకరింగ్ అంటే మాకు ఇష్టమే కాని..అలా అనకుండా ఉండాల్సింది అంటూ సుమపై అసహనం వ్యక్తం చేశారు. అయితే దీనిపై వెంటనే సుమ క్షమాపణ కోరడం జరిగింది. మ్యాటర్ పెద్దది కావడంతో.. ఈవెంట్ ముగిసిన తరువాత సుమ ఓ వీడియోను పోస్ట్ చేస్తూ.. మీడియా ప్రతినిధులను మరోసారి క్షమాపణ కోరారు. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తన 20 ఏళ్ల కెరీర్‌లో సుమ ఎప్పుడు కూడా ఈ విధంగా చేసింది లేదు. క్షమాపణ చెప్పిన తరువాత మీడియారంగం సుమపై ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.
-
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !! -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ.. నాన్ స్టాప్ నవ్వుల జాతర షురూ..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
అన్న హీరో.. చెల్లి నిర్మాత.. "బరి" వీడియో వైరల్ !! -
ఓటీటీలో జనాలు ఎగబడి చూస్తున్న సినిమా ఇదే.. మీరు చూశారా? -
ప్రశాంత్ వర్మ మ్యాజిక్.. అక్షయ్ ఖన్నా రోల్ మామూలుగా లేదుగా! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే












Click it and Unblock the Notifications