హిందీలోకి "సంక్రాంతికి వస్తున్నాం"... హీరో ఎవరంటే..!
విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ "సంక్రాంతికి వస్తున్నాం". సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం నమోదు చేసింది. విడుదలైన 14 రోజుల్లోనే రూ. 260 కోట్లు వసూల్ చేసి రికార్డ్ వసూళ్లు నమోదు చేసింది. వెంకీ మామ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది సంక్రాంతికి వస్తున్నాం మూవీ. ఇక ఫుల్ రన్ లో ఈ మూవీ రూ. 300 కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్ లోనూ ఈ మూవీ దుమ్ముదులుపుతోంది. విదేశాల్లోని ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ మూవీకి బ్రహ్మరథం పట్టారు. ఇప్పటికే అక్కడ 2.6 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టింది. త్వరలో 3 మిలియన్ డాలర్ల మార్కును ఈ మూవీ అందుకోనుంది.
వెంకీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్..
వెంకీమామ కెరీర్ లో ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పటికే రూ. 100కోట్ల షేర్ క్లబ్ లోకి వెళ్లిన వెంకీ.. తెలుగు సీనియర్ హీరోల్లో రూ. 100కోట్ల షేర్ చూసిన రెండో హీరోగా నిలిచారు. ఇక ఫస్ట్ ప్లేస్ లో మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు. అయితే తాజాగా ఈ మూవీ రూ. 250 కోట్లు సాధించగా.. చిరును కూడా దాటేసి వెంకటేశ్ ఇప్పుడు టాప్ ప్లేస్ లో ఉన్నారు.

హిందీలోకి రీమేక్..
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి వస్తున్నాం మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ సినిమాను బాలీవుడ్ లోకి తీసుకెళ్లాలన్న యోచనలో దర్శకుడు అనిల్ రావిపూడి ఉన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ బ్లాక్ బస్టర్ డైరెక్టర్.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాను హిందీలోకి రీమేక్ చేసే యోచనలో ఉన్నట్లు చెప్పినట్లు సమాచారం. " నాకు అవకాశం వస్తే ఈ మూవీని హిందీలో రీమేక్ చేస్తా. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఈ కథకు సరిగ్గా సెట్ అవుతారు." అని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ నటించారు. నరేశ్, వీటీ గణేశ్, సాయి కుమార్, మురళీ, పృథ్వీరాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. భీమ్స్ సిసిరొలియో సంగీతం అందించారు. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు.












Click it and Unblock the Notifications