అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య.. ‘భగవంత్ కేసరి’కి ప్రీక్వెల్

నందమూరి బాలకృష్ణ అభిమానులకు ఇది నిజంగా పూనకాలు తెప్పించే వార్తనే చెప్పాలి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటించిన 'భగవంత్ కేసరి' బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడమే కాదు, ఆయన కెరీర్‌లోనే ఒక విభిన్నమైన చిత్రంగా నిలిచింది. కమర్షియల్ హంగులతో పాటు బలమైన సందేశాన్ని అందించిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో అవార్డును కూడా అందుకోవడం విశేషం.

ఇప్పుడు ఈ సక్సెస్‌ను మరింత ఎత్తుకు తీసుకెళ్లే వార్త బయటకు వచ్చింది. 'భగవంత్ కేసరి'కి ప్రీక్వెల్ రాబోతోందని స్వయంగా దర్శకుడు అనిల్ రావిపూడినే వెల్లడించారు. బాలయ్య అభిమానుల నుంచి భారీగా వస్తున్న రిక్వెస్టుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన తెలిపారు. తన కెరీర్‌లో 'భగవంత్ కేసరి' అత్యంత ప్రత్యేకమైన చిత్రమని, ఆ పాత్రతో తనకు ఉన్న అనుబంధం ఎంతో గాఢమని అనిల్ పేర్కొన్నారు.

Balayya in a film directed by Anil Ravipudi a prequel to Bhagavanth Kesari

గతంలో బాలయ్య ఎవరు? అనేది చాలా శక్తివంతం
ఈ ప్రీక్వెల్ కథ మరింత పవర్‌ఫుల్‌గా, బాలయ్య మాస్ ఇమేజ్‌కు తగ్గ రేంజ్‌లో ఉంటుందని అనిల్ రావిపూడి స్పష్టం చేశారు. అసలు భగవంత్ కేసరి ఖాకీ డ్రెస్ వేసుకునే ముందు ఎవరు? ఆయన గత జీవిత నేపథ్యం ఏమిటి? ఎలాంటి పరిస్థితుల్లో ఆయన ఈ స్థాయికి చేరుకున్నారు? అనే ఆసక్తికర అంశాలతో కథను మరో లెవెల్‌కు తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. భగవంత్ కేసరి గత జీవితాన్ని అత్యంత భారీ స్థాయిలో వెండితెరపై ఆవిష్కరించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఈ వార్త వెలుగులోకి రావడంతో బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషీలో మునిగిపోయారు. సోషల్ మీడియాలో ఇప్పటి నుంచే ప్రీక్వెల్‌పై భారీ అంచనాలు మొదలయ్యాయి.

ఎఫ్4 కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న అనిల్
మరోవైపు, తాజాగా అనిల్ రావిపూడి-మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చిన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం రూ. 350 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ విజయం జోరులోనే అనిల్ రావిపూడి మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టారు. తన సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీ 'F4' కోసం కూడా ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. వరుస హిట్లతో దూసుకుపోతున్న అనిల్, భవిష్యత్తులో మరికొందరు స్టార్ హీరోలతో వినూత్నమైన కథలను సిద్ధం చేస్తున్నట్లు తాజా ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+