చిరుతో మూవీకి అనిల్ రావిపూడికి కళ్లు చెదిరే రెమ్యూనరేషన్..

డైరెక్టర్ అనిల్ రావిపూడి ఫుల్ జోష్ లో ఉన్నారు. పటాస్ సినిమాతో దర్శకుడిగా మారిన ఈ డైరెక్టర్.. అంతకు ముందు ఎన్నో చిత్రాలకు రైటర్‌గా పని చేశాడు. ఇక ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు ఘోస్ట్ రైటర్‌గానూ పని చేశానని చెబుతారు. ఇప్పటి వరకు 8 సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. హిట్ ట్రాక్ ని కొనసాగిస్తూ వరుస విజయాలతో డైరెక్టర్ రాజమౌళి సరసన స్థానాన్ని సంపాదించుకున్నాడు.

రీసెంట్ గానే సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ హిట్ అందుకుంది. ఏకంగా 300 కోట్లు కలెక్షన్స్ కొల్లగొట్టి అందరికీ షాక్ ఇచ్చింది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో వచ్చిన ఈ చిత్రం పొంగల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. దీంతో మళ్లీ సంక్రాంతికి సంక్రాంతికి మళ్లీ వస్తున్నాం అనే పేరుతో సినిమా చేస్తామని కూడా ప్రకటించారు.

Anil Ravipudi s eye-catching remuneration for Chirutho movie

ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో ఓ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా చిరంజీవితో చేయబోయే సినిమా గురించి అనిల్ రావిపూడి ఆసక్తికర కామెంట్లు చేశారు. మరో నాలుగు నెలల్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుందని కూడా తెలియజేశారు. అయితే లైలా మూవీతో భారీ డిజాస్టర్ కావడంతో నిర్మాత సాహు గారపాటి ఆశలన్నీ అనిల్ రావిపూడి - చిరంజీవి సినిమా పైనే పెట్టుకున్నారు.

ఈ క్రమంలోనే నెట్టింట్లో అనిల్ రావిపూడి రెమ్యూనరేషన్ గురించి పలు రూమర్లు వినిపిస్తున్నాయి. చిరుతో చేయబోయే సినిమాకి అనిల్ రావిపూడి ఏకంగా రూ.25 కోట్ల రెమ్యూనరేషన్ తో పాటు సినిమా హిట్ అయి లాభాలు వస్తే లాభాల్లో వాటాలు తీసుకునేందుకు డేల్ సెట్ చేసుకున్నారని టాక్ నడుస్తోంది. అనిల్ రావిపూడి మీద నమ్మకంతో నిర్మాత సైతం ఆ డిమాండ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం చిరంజీవి మెగాస్టార్‌ చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ముగింపు దశకు చేరుకున్న ఈ మూవీ 2025 సమ్మర్‌లో విడుదల కానుంది. ఆ తర్వాత అనిల్‌ రావిపూడి సినిమానే ప్రారంభం అవుతుందని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+