'యానిమల్' రివ్యూ: చంపేశాడురా!!
రణబీర్ కపూర్, రష్మిక మందన్న అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు
డైరెక్టర్: సందీప్ రెడ్డి వంగా
నిర్మాతలు: భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, మురాడ్ కేతాని, ప్రణయ్ రెడ్డి వంగా
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
సినిమాటోగ్రఫీ: అమిత్ రాయ్
అర్జున్ రెడ్డి/కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన చిత్రం "యానిమల్". రణబీర్ కపూర్ టైటిల్ పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ప్రధానంగా ట్రైలర్ విడుదలయ్యాక సినిమా మీద అంచనాలు పెరిగాయి. సందీప్ ఆ అంచనాలను అందుకున్నాడా? లేడా?
కథ
రణ్ విజయ్ సింగ్ బల్బీర్ (రణబీర్ కపూర్) చిన్నతనం నుంచి తండ్రి మీద విపరీతమైన ప్రేమతో పెరుగుతాడు. తండ్రి తర్వాత తన కుటుంబానికి అన్నీ తానై చూసుకోవాలనుకుంటాడు. అందుకు ఎంత దూరమైనా వెళ్తాడు. అతడి ప్రేమ మెల్లమెల్లగా డామినేషన్ గా మారుతుంది. తండ్రి వెళ్లిపొమ్మన్నాడని తాను ప్రేమించిన గీతాంజలిని (రష్మిక మందన్న) పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళి స్థిరపడతాడు విజయ్.

ఢిల్లీలో తన తండ్రిపై గన్ అటాక్ జరిగిందని తెలుసుకొని విజయ్ దేశానికి కుటుంబంతో సహా తిరిగి వచ్చేస్తాడు. న తండ్రిపై అటాక్ చేసింది ఎవరు? అనేది కనిపెట్టడం కోసం విశ్వప్రయత్నం చేస్తుంటాడు. అసలు బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) మీద దాడి చేసింది ఎవరు? అందుకు కారణం ఏమిటి? వారి మీద విజయ్ ఎలా పగ తీర్చుకున్నాడు? అనేది "యానిమల్" కథ.
నటీనటుల పనితీరు
రణబీర్ కపూర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అంటే అందరు "రాక్ స్టార్" అని చెప్పేవారు. "యానిమల్" ఇప్పుడు ఆ స్కేల్ ను మార్చేసింది. ఒక నటుడిగా రణబీర్ కపూర్ పూర్తిస్థాయి సామర్థ్యాన్ని ఈ సినిమా ఉపయోగించుకుంది. అతడిలో ఉండే భిన్నమైన ఎమోషన్స్ ను చాలా స్ట్రాంగ్ గా చూపించారు. రణబీర్ కపూర్ లోని క్రోధాన్ని పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు పరిచయం చేసిన పాత్ర ఏది అంటే రణ్ విజయ్ సింగ్ బల్బీర్.
ఈ పాత్ర ప్రభావం నుంచి కానీ, ఈ సినిమా ప్రభావం నుంచి కానీ బయటకు రావడానికి ఎంతో కొంత సమయం రణ్ బీర్ కపూర్ కు పడుతుంది. అతడిని ఒక సాధారణ నటుడిలా మళ్లీ అంగీకరించాలంటే ప్రేక్షకులకు చాలా సమయం పట్టొచ్చు. అతని కెరీర్ లో ఎప్పటికీ మర్చిపోలేని సినిమాగా ఇది మిగిలిపోతుంది. రష్మిక నటన మాత్రం తేలిపోయింది. సెకండాఫ్ లో వచ్చే 15 నిమిషాల ఎమోషనల్ సీన్ లో ఆమె నటన, డైలాగ్ డెలివరీ చాలా పేలవంగా ఉంది.
రష్మిక మందన్న సినిమాకి ఎలాంటి వేల్యూ యాడ్ చేయలేకపోయింది. వాస్తవంగా చెప్పాలంటే జోయా పాత్రలో నటించిన త్రిప్తి దిమ్రీ తక్కువ స్క్రీన్ టైమ్ తో ఎక్కువ మార్కులు కొట్టేసింది. బాబీ డియోల్ నుంచి ఇంకాస్త ఎక్కువ స్క్రీన్ టైమ్ రావాల్సి ఉంటుందికానీ ట్రైలర్ లో చూపించిన షాట్స్ తోనే ముగించేశాడు. బాగా ప్రభావం చూపించాల్సిన ఈ పాత్ర కొంతవరకే మిగిలిపోయింది. అనిల్ కపూర్, శక్తికపూర్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు
హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకి మరో హీరో. తన నేపథ్య సంగీతంతో అతడు సినిమాకి మెయిన్ ఎస్సెట్ గా నిలిచాడు. ఇంటర్వెల్ బ్లాక్ & సెకండాఫ్ లో వచ్చే కొన్ని భావోద్వేగాల సన్నివేశాలను అతడు సౌండ్ డిజైన్ చేసిన విధానం ఆశ్చర్యపరుస్తుంది. ఏ సన్నివేశానికి సంగీతం, ఏ సన్నివేశానికి నిశ్శబ్దం అవసరం అని జడ్జ్ చేయగలగడం కూడా ఒక గొప్పతనమే. ఈ సినిమా తర్వాత అతడికి బాలీవుడ్ నుంచి ఆఫర్లు వెల్లువెత్తడం ఖాయమంటున్నారు విశ్లేషకులు.
అమిత్ రాయ్ సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. కొన్ని యాక్షన్ సీన్స్ లో సీజీ వర్క్ కి అవకాశం లేకుండా చాలా సహజంగా పిక్చరైజ్ చేసిన విధానం అద్భుతం. ముఖ్యంగా రణబీర్-బాబీల ఫైట్ సీక్వెన్స్ ను షూట్ చేసిన విధానం సూపర్. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. దర్శకుడు సందీప్ ముందునుంచి చెబుతున్నట్లుగానే అత్యంత వైల్డ్ సినిమాను అందించాడు. ఎమోషన్స్, యాక్షన్, సెంటిమెంట్స్ అన్నీ వేరేస్థాయిలో ఉంటాయి.
కబీర్ సింగ్ లోని మేల్ ఈగోకి బాబు లాంటి ఆల్ఫా (ALPHA) క్యారెక్టర్ రణ్ విజయ్ సింగ్ ది. రణబీర్ కపూర్ లోని నటుడ్ని పూర్తిస్థాయిలో వాడుకున్నారు. మిగతా పాత్రలను జస్ట్ సైడ్ క్యారెక్టర్స్ లా కాకుండా, కథనానికి సరిగ్గా ఉపయోగపడేలా డిజైన్ చేసిన విధానం బాగుంది. తండ్రీ కొడుకుల సెంటిమెంట్ సన్నివేశాల్లో సందీప్ తన బలాన్ని చూపించాడు.
చివరి 10 నిమిషాల రణబీర్-అనిల్ కపూర్ ల సంభాషణ తో సీక్వెల్ మరింత క్రూరంగా ఉండబోతోందని అర్థమైంది. సెకండాఫ్ లో జోయా పాత్ర మాత్రం కొందరికి కనెక్ట్ అవ్వకపోవచ్చుకానీ ఆ పాత్రతో జరిపే శృంగార సన్నివేశాలు మాత్రం చర్చనీయాంశమవుతాయి. "అర్జున్ రెడ్డి"తో కథకుడిగా ఎక్కువ మార్కులు సంపాదించుకున్న సందీప్ "యానిమల్"తో దర్శకుడిగా, ఎడిటర్ గా మంచి మార్కులు కొట్టేశాడు. సన్నివేశాల ట్రాన్సిషన్, వాటి మూడ్ ను బట్టి సెట్ చేసిన కలర్ థీమ్, డి.ఐ టెక్నీషియన్ గా అతడి ప్రతిభను చాటింది.
చివరగా
ఎవ్వరూ ఊహించని స్థాయిలో "యానిమల్" ఉంటుంది. రణబీర్ నట విశ్వరూపం, హర్షవర్ధన్ రామేశ్వర్ నేపథ్య సంగీతం సినిమాకి మెయిన్ ఎస్సెట్స్. "దునియా జలదేంగే" పాట సినిమాకి మంచి కిక్ ఇస్తుంది. ఇంతటి వైల్డ్ ఎమోషనల్ రైడ్ సినిమాను పిల్లలకు చూపించకుండా ఉంటేనే మంచిది.
-
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
యాంకర్ విష్ణుప్రియకి బిగ్ షాక్.. క్రిమినల్ కేసు?? -
తప్పు తప్పు.. అంతకు ముందు అలా చేయలేదా ?? అనసూయ పోస్ట్ వైరల్ !! -
నమ్మినోడే.. ముంచేశాడుగా.. టాలీవుడ్ బడా నిర్మాతకు వెన్నుపోటు !! -
‘బాహుబలి2’ను దాటలేకపోయిన ‘ధురంధర్2’ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
NTRNeel: వాడి బాడీ బాక్సాఫీస్ రా: `హెర్కులెస్`.. !! -
"ఆశా బోస్లే"కు భర్త బర్మన్ పెళ్లికి ముందే ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఏంటో తెలుసా ??? -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications