కావ్య పాపతో పెళ్లిపై అనిరుద్ ఓపెన్.. అలా జరిగిపోయిందంటూ
కావ్య మారన్ .. ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని ఉండరు. ఎందుకంటే క్రికెట్‌ను ఫాలో అయ్యేవారికి కావ్య మారన్ సుపరిచితురాలే. ముఖ్యంగా ఐపీఎల్‌ను ఇష్టపడేవారికి కావ్య మారన్ తెలియకుండా ఉండరు.సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ అనే సంగతి అందరికి తెలిసిన విషయమే.. ఐపీఎల్‌తో కావ్యా మారన్ బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు. అభిమానులు ఆమెను ముద్దుగా కావ్య పాప అని పిలుచుకుంటారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లు జరిగిన ప్రతిసారి స్టాండ్స్‌లో కూర్చొని జట్టును ఎంకరేజ్ చేస్తుంటారామె.
కావ్య భావోద్వేగాలు కూడా క్రికెట్ అభిమానులను ఇట్టే ఆకట్టుకుంటాయి. హైదరాబాద్ టీం గెలిచినా, ఓడినా కావ్య పాప ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ అన్ని ఇన్ని కావు. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీంను ఇష్టపడే వారు ఉన్నారో లేదో కాని.. కావ్య మారన్‌ని ఇష్టపడని వారుండరు. కావ్య మారన్ కోసమే సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచులు చూసే వారి కూడా ఉన్నారంటే ఆమె ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఇదిలా ఉంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. కావ్య మారన్ చుట్టూ ఎన్నో డేటింగ్ రూమర్స్ మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి.కావ్య మారన్ పలువురితో డేటింగ్ చేసిందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. టాప్ మ్యూజిక్ డైరెకర్ట్ అనిరుద్ రవిచంద్రన్‌తో కావ్య మారన్ ఎక్కువగా కనిపించింది. దీంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారని వార్తలు షికార్లు చేశాయి.
Marriage ah? lol .. Chill out guys 😃 pls stop spreading rumours 🙏🏻
— Anirudh Ravichander (@anirudhofficial) June 14, 2025
అయితే తాము బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి షాకిచ్చారు. తాజాగా మరోసారి వీరిద్దరి పెళ్లి గురించి ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాజాగా దీనిపై అనిరుద్ స్పందించారు.ఒక్క ట్వీట్‌తో ఫుల్ స్టాప్ పెట్టేశాడు. స్వయంగా తానే ఈ ఇష్యూపై క్లారిటీ ఇచ్చాడు. ' పెళ్లా? చిల్ అవుట్ గాయ్స్.. రూమర్స్ స్ప్రెడ్ చేయడం ఆపండంటూ పోస్ట్ పెట్టాడు. దీంతో వీరిద్దరి మధ్య ఎలాంటి బంధం లేదని మరోసారి తేలిపోయింది.












Click it and Unblock the Notifications