తెలుగులో హీరోయిన్ అవ్వాలంటే 'కాంప్రమైజ్' కావాలి!

టీవీ కార్యక్రమాల్లో 20 ఏళ్లుగా సందడి చేస్తోంది అంకిత లోఖండే. కంగనా రనౌత్‌ దర్శకత్వంలో రూపొందిన 'మణికర్ణిక' చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత మరో నాలుగు సినిమాలు చేసింది. పాపులర్ టీవీ ప్రోగ్రామ్స్ తో గతంలో ఉత్తమ నటిగా కూడా అవార్డులు గెలుచుకుంది. బాలీవుడ్ లో ఇంత పాపులారిటీ ఉన్న మీరు టాలీవుడ్ లోకి ఎందుకు అడుగు పెట్టలేదని ప్రశ్నిస్తే ఆమె నుంచి వచ్చిన సమాధానం అందరినీ షాక్ కు గురిచేసింది. తెలుగు పరిశ్రమలో తనకు కాస్టింగ్ కౌచ్ ఎదురైనట్లు వెల్లడించింది.

చిన్నతనం నుంచి హీరోయిన్ అవ్వాలనేది తన లక్ష్యమని, దీనికోసం ఎంతో ప్రయత్నించానని, ఓవైపు టీవీ కార్యక్రమాలు చేస్తూనే సినిమాల్లో కూడా ప్రయత్నించినట్లు అంకిత తెలిపింది. తెలుగు సినీ పరిశ్రమలో ఓ ప్రముఖ నిర్మాత కొత్త సినిమా తీయబోతున్నట్లు తెలిసి హైదరాబాద్ వెళ్లాలనని, అక్కడ ఆడిషన్ కూడా నిర్వహించారని చెప్పింది. ఆడిషన్స్ పూర్తయి ముంబయి వెళ్లిపోయిన తర్వాత తనకు ఒక ఫోన్ వచ్చిందని, అందులో తాను హీరోయిన్ గా ఎంపికైనట్లు చెప్పారని, హైదరాబాద్ వచ్చి అగ్రిమెంట్ పై సంతకం చేయమన్నారని పేర్కొంది. అంకిత ఇంకా ఏం చెప్పిందంటే..

ankitha lokhande shocking comments on telugu film industry

అంత సులువుగా తాను హీరోయిన్ గా ఎంపికవుతాననేది నమ్మలేకపోయింది. వెంటనే అనుమానం వచ్చి తన అసిస్టెంట్ తోపాటు హైదరాబాద్ వెళ్లింది. నిర్మాత కార్యాలయానికి వెళ్లగా ఒంటరిగా ప్రొడ్యూసర్ రూమ్ కు వెళ్లమని చెప్పారు. హీరోయిన్ అవ్వాలంటే కొంత కాంప్రమైజ్ కావాల్సి ఉంటుందని అంకితతో సదరు నిర్మాత అన్నారంట. ఆ సమయంలో ఆమె వయసు కేవలం 19 సంవత్సరాలే. కాంప్రమైజ్ అనే మాటకు అర్థం తెలియలేదు. అయితే తానేం చేయాలి అనే విషయాన్ని అడిగింది. అందుకా నిర్మాత తనతో బెడ్ షేర్ చేసుకుంటే హీరోయిన్ గా అవకాశం ఇస్తానన్నాడు. దీంతో షాక్ తిన్న అంకిత ఆ నిర్మాతపై తీవ్రస్థాయిలో విరుచుకుపడి ముంబయి వచ్చేసింది. ఆ తర్వాత ఎప్పుడూ హైదరాబాద్ తెరిగి వెళ్లలేదు. బాలీవుడ్ లోనే తనకు అవకాశాలు వస్తున్నాయని, టీవీ కార్యక్రమాలతోపాటు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నట్లు చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+