అప్పుడే ఓటీటీలోకి సంక్రాంతి మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ, కృతి శెట్టి జంటగా నలన్ స్వామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'వా వాతియార్'. తెలుగులో 'అన్నగారు వస్తారు' అనే టైటిల్ తో తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజైన ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద ప్లాఫ్ టాక్ తెచ్చుకుంది. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని కేఈ జ్ఞానవేల్ రాజా తెరకెక్కించారు. ఇక ఈ మూవీ అనేక సార్లు వాయిదాల పర్వం తర్వాత సంక్రాంతి కానుకగా తమిళంలో రిలీజైంది. కానీ తెలుగులో రిలీజ్ అవ్వలేదు. డైరెక్ట్ గా ఓటీటీ లోకి ఇప్పుడు రానుంది.
అయితే తమిళంలో రిలీజై రెండు వారాలు కూడా కాకముందే ఓటీటీలోకి ఈ మూవీ రానుంది. జనవరి 28 నుంచి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ఈ మేరకు వా వాతియార్ ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఈ మూవీ తమిళంతో పాటుగా తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటించింది.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. లెజెండరీ నటుడు ఎంజీఆర్ కు వీరాభిమాని అయిన తాత (రాజ్‌కిరణ్), అతని మనవడు రామేశ్వరన్ (కార్తీ)ని కూడా ఎంజీఆర్ లాగే అత్యంత నిజాయితీపరుడిగా చూడాలని కోరుకుంటాడు. అయితే తాత ఆశయం మేరకు పోలీస్ అధికారి అయిన రామేశ్వరన్, లోలోపల మాత్రం తాత అంచనాలకు భిన్నంగా లంచగొండిగా, అవినీతిపరుడిగా మారుతాడు.

అయితే ఒకానొక సందర్భంలో తాతకు మనవడి అసలు రంగు తెలియడం, ఆ బాధతో ఆయన కన్నుమూయడం సినిమాలో బిగ్గెస్ట్ మలుపు గా ఉంటుంది. ఇక తాత మరణం తర్వాత ఆ అపరాధ భావంతో రామేశ్వరన్ తనను తాను ఎలా మార్చుకున్నాడు.. ఒక నిజాయతీ గల ఆఫీసర్ గా ఎలా ఎదిగాడు అన్నదే ఈ సినిమా కథాంశం.












Click it and Unblock the Notifications