Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

స‌లార్ పార్ట్ 2లో ప్ర‌భాస్‌కి జోడిగా మ‌రో బాలీవుడ్ న‌టి..!

స‌లార్ పార్ట్ 2 సినిమా కోసం యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు. గ‌త సంవ‌త్స‌రం స‌లార్ పార్ట్ 1 విడుద‌ల‌య్యి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కైవ‌సం చేసుకుంది. ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఇక‌, స‌లార్ మూవీలో హీరోయిన్‌గా శుత్రీహాస‌న్ న‌టించింది. ఇప్ప‌డు స‌లార్ పార్ట్ 2 సినిమాపై సోష‌ల్‌మీడియాలో ఓ వార్త తెగ వైర‌ల్ అవుతోంది. ఈ సినిమాలో మ‌రో బాలీవుడ్ యంగ్ బ్యూటీ న‌టిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

గ‌తేడాది బ్లాక్‌బ‌స్ట‌ర్‌ హిట్ అందుకున్న‌మూవీ సలార్ పార్ట్- 1 సీక్వెల్ తాజాగా ప్రారంభమైంది. అయితే, స‌లార్ 2 రీసెంట్​గా షూటింగ్ కూడా ప్రారంభించింది. క తొలి భాగానికి కొనసాగింపుగా 'శౌర్యాంగ పర్వం' పేరుతో రెండో పార్ట్​ కు కూడా సిద్ధ‌మ‌య్యింది. ఈ సినిమా గురించి ఇప్ప‌డు ఓ న్యూస్ సోష‌ల్‌మీడియాలో తెగ హాల్చ‌ల్ చేస్తోంది. బాలీవుడ్ యంగ్ బ్యూటీ కియారా అడ్వాణీ ఈ సినిమాలో నటించే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. స‌లార్ రెండో పార్ట్​లో ఆమె ప్రభాస్​తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లు బీ టౌన్ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న టాక్‌. ఇందులో కియారాతో ద‌ర్శ‌కుడు ప్రశాంత్ నీల్ ఓ స్పెషల్ సాంగ్ కూడా డిజైన్ చేస్తున్నార‌ని స‌మాచారం. స‌లార్ పార్ట్ 2లో కియారా పాత్ర సెంకడ్ హాఫ్​లో ఉండ‌బోతుంద‌ని కొంద‌రు అంటున్నారు. ఇక ప్రభాస్ స‌ర‌స‌న బాలీవుడ్ యంగ్ బ్యూటీ కియారా న‌టిస్తుంది అనగానే అభిమానులు తెగ పండ‌గ చేసుకుంటున్నారు.

Another Bollywood actress to join Prabhas in Salaar Part 2

2025లో స‌లార్ పార్ట్ 2..

పాన్ఇండియా స్థాయిలో తెరకెక్కిన స‌లార్ పార్ట్ 1 సినిమా బాక్సాపీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది. ఇక‌, స‌లార్ పార్ట్ 2 కూడా అదే స్థాయిలో రాబోతుంది. ఇది ఒక యాక్ష‌న్ చిత్రం. ఈ మూవీ ప్రభాస్​కు బాహుబ‌లి త‌ర్వాత మంచి సక్సెస్‌ను అందించిన చిత్రంగా చెప్పొచ్చు. ఈ స‌లార్ పార్ట్ 2 షూటింగ్ కూడా రీసెంట్​గా ప్రారంభమైంది. ఇటీవ‌లే స‌లార్ సినిమా నిర్మాత విజయ్ కిరగందూర్ మూవీ షూటింగ్​పై కూడా అప్డేట్ ఇచ్చారు. ఏప్రిల్​లో చిత్రీకరణ ప్రారంభమైందని, 2025లో సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఓ సందర్భంలో చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+