బాలయ్య - బోయపాటి కాంబోలో మరో చిత్రం.. నిర్మాత ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే బాలయ్య అభిమానులకే కాదు.. సినీ ప్రియులందరికీ రోమాలు నిక్కపొడుచుకుంటాయి. బాలయ్య చెప్పే శక్తివంతమైన డైలాగులు, పోరాట దృశ్యాలు, తమన్ అందించే బీజీఎం సినిమాను మరో స్థాయికి తీసుకువెళతాయి. సింహా, లెజెండ్, అఖండ, అఖండ2... ఈ సినిమాలన్నీ అలాగే ఉంటాయి. ఇప్పుడు తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోంది. ఇది బాలయ్యకు 112వ సినిమా అవుతుంది. గీత ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు.

111వ సినిమాతో గట్టిగానే ప్లాన్ చేస్తున్న గోపీచంద్
ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 111వ సినిమా చేస్తున్న బాలయ్య ఇది పూర్తవగానే బోయపాటితో సినిమా చేస్తాడు. 2026 చివర్లో కానీ, 2027లో కానీ ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. గీతా ఆర్ట్స్ బ్యానరులో బోయపాటి ఓ సినిమా చేయాల్సి ఉంది. అందుకు నిర్మాత అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అల్లు అర్జున్ తో చేయాలని కథను కూడా సిద్ధం చేసుకున్నారు. వినిపించారు. గతంలో వీరిద్దరి కాంబోలో సరైనోడు సినిమా వచ్చింది. అప్పటికి అల్లు అర్జున్ కెరీర్ లో అతి పెద్ద హిట్ సినిమాగా నిలిచింది. తర్వాత మరో సినిమా చేద్దామనుకున్నప్పటికీ ఇంతవరకు కుదర్లేదు. అట్లీతో ఓ సినిమా చేస్తున్న బన్నీ.. తన తర్వాత సినిమా పుష్ప3 చేయబోతున్నారు. ఒకరకంగా ఖాళీ లేనట్లే అనుకోవాలి. దీంతో బోయపాటితో చేయడం కుదరదని అర్థమపోతోంది.

Another film is coming in the Balayya-Boyapati combination you will be surprised to know who the producer is

దానికోసమే ఎదురుచూస్తున్న ఫ్యాన్స్
అల్లు అరవింద్ కూడా ఎప్పటినుంచో తమ బ్యానరులో బాలయ్యతో సినిమా చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. బాలకృష్ణ కూడా ఓకే చెప్పారు. తనకు అచ్చొచ్చిన బోయపాటితో మాములు కమర్షియల్ సినిమా చేయబోతున్నారు. గీతా ఆర్ట్స్ అంటేనే స్క్రిప్ట్ నచ్చితేనే, పక్కాగా ఉంటే రంగంలోకి దిగుతుంది. కాబట్టి అల్లు అరవింద్ కు బోయపాటి ఇచ్చిన స్క్రిప్ట్ బాగా నచ్చినట్లు అర్థమవుతోంది. కాబట్టి ఈ సినిమా కూడా గ్యారంటీ హిట్ అనే అంచనాలు ఉన్నాయి. అప్పుడు బోయపాటి, బాలయ్యలకు వరుసగా ఐదోహిట్ అవుతుంది. ప్రస్తుతం 111వ సినిమా హిట్ అయితే బాలయ్య డబుల్ హ్యాట్రిక్ సాధించిన హీరోగా తెలుగు సినీ పరిశ్రమలో సంచలన రికార్డును సృష్టించిన వ్యక్తి అవుతాడు. ఆ అరుదైన ఫీట్ కోసమే అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+