నాగచైతన్య లైఫ్‌లో మరో సమంత ఎంట్రీ

హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంత బంధం గురించి అందరికి తెలిసిన విషయమే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో సమంత -నాగచైతన్య జంట బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరు భావించారు. కాని వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు.

అయితే వీరి విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సమంతది తప్పంటే.. లేదు లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేసుకున్నారు. విడాకులపై సమంత తన సినిమాల విడుదల సమయంలో పరొక్షంగా నాగచైతన్యపై స్పందిస్తూ వస్తున్నారు. కాని నాగచైతన్య దీనిపై ఎప్పుడు మాట్లాడింది లేదు. అయితే వారిద్దరు తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.

 another heroine replace samantha in naga chaitanya movies

ఇదిలా ఉంటే నాగచైతన్య సినీ లైఫ్‌లో సమంత స్థానాన్ని భర్తీ చేయడానికి సిద్ధం అవుతున్నాడనిపిస్తోంది. ఇప్పటి వరకు నాగచైతన్య హీరోయిన్స్‌ను రిపీట్ చేసిన సందర్భాలు చాలా తక్కువే. ఒక్క సమంతతో మాత్రమే నాలుగు సినిమాల్లో నటించాడు. ఏ మాయ చేశావే, మనం, ఆటో నగర్ సూర్య, మజిలి సినిమాల్లో సమంతతో కలిసి నాగచైతన్య నటించాడు.

ఇప్పుడు ఆ స్థానాన్ని సాయిపల్లవికి భర్తీ చేయడానికి రెడీ అయింది. సాయి పల్లవి ఇప్పటికే నాగచైతన్యతో జోడిగా ఓ సినిమాలో కనిపించింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్‌స్టోరీ సినిమాలో నాగచైతన్య - సాయిపల్లవి కలిసి నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం సాయి పల్లవితో నాగ చైతన్య మరో సినిమాలో నటిస్తున్నాడు.

 another heroine replace samantha in naga chaitanya movies

చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య తాండెల్ సినిమాలో సాయి పల్లవితో మరోసారి నటిస్తున్నాడు. వీరిద్దరికి ఈ సినిమా రెండోది కావడం విశేషం. ఈ సినిమాతో పాటు నాగ చైతన్య కొత్త సినిమాలో కూడా హీరోయిన్‌గా సాయి పల్లవి పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం అందుతుంది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు..నాగచైతన్య లైఫ్‌లోకి మరో సమంత వచ్చిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+