నాగ చైతన్య - తండేల్ డైరెక్టర్ కాంబోలో మరో మూవీ.. ఏ సినిమా రీమేక్ అంటే..?

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన సినిమా తండేల్. ఫిబ్రవకారి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తో భారీ హిట్ అందుకుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో తండేల్ లవ్ సునామీ సెలబ్రేషన్స్ ఈవెంట్ ని గ్రాండ్‌గా నిర్వహించారు. సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు, అక్కినేని నాగార్జున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్ వేదికగా మాట్లాడుతూ.. దర్శకుడు చందు అక్కినేని అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పాడు.

నాగ చైతన్యతో ఓ హిస్టారికల్ సినిమా చేయబోతున్నట్లు చందు అనౌన్స్ చేశాడు. గతంలో అక్కినేని నాగేశ్వరరావు నటించిన తెనాలి రామకృష్ణ చిత్రాన్ని నాగచైతన్యతో తెరకెక్కిస్తానని ప్రకటించారు. శోభిత గారూ... మీరు తెలుగు చక్కగా మాట్లాడతారు... ఆ తెలుగును మా హీరోకి కూడా బదిలీ చేయండి. భవిష్యత్తులో మేం చారిత్రాత్మక చిత్రం చేయబోతున్నాం అని తెలిపారు. ఈ సినిమాలో నాగచైతన్య నటన చూసిన వారు మరో ఏఎన్నార్ అనుకునేలా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

another movie in Naga Chaitanya - Tandel director combination

ఇప్పటికే తండేల్ భారీ హిట్ సాధించడంతో ఫుల్ ఖుషీగా ఉన్న ఫ్యాన్స్ కి ఈ ప్రకటన డబుల్ బోనాంజా అని సంతోషం వ్యాకళతాం చేస్తున్నారు. ఇక ఇప్పటికే చందు - చైతన్య కాంబినేషన్ లో ప్రేమమ్, సవ్యసాచి సినిమాలు వచ్చాయి. హ్యట్రిక్ గా వచ్చిన తండేల్ భారీ హిట్ అందుకోవడంతో.. ఇప్పుడు నాలుగో సినిమా సైతం సూపర్ హిట్ అవుతుందని భావిస్తున్నారు.

ఇక తండేల్ సినిమాలో నాగ చైతన్య నటన అదిరిపోయిందని ప్రేక్షకులు చెబుతున్నారు. దేశభక్తి ఎలిమెంట్స్‌తో అందమైన ప్రేమకథను చూపించారని అంటున్నారు. సాయి పల్లవి, నాగ చైతన్య ఇద్దరూ పోటీపడి మరీ నటించారని అంటున్నారు. సినిమా అంతా ఒక ఎత్తు అయితే, చివరి 20 నిమిషాల సినిమాను దర్శకుడు మరో లెవెల్‌కు తీసుకువెళ్లారని చెబుతున్నారు. క్లైమాక్స్‌లో నాగ చైతన్య నటన అందర్నీ కత్తిపడేసిందని కితాబు ఇస్తున్నారు. ఈ సినిమా నాలుగు రోజుల్లో 73 కోట్ల 20 లక్షలకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసినట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+