మా అసోసియేషన్ నుంచి నటి హేమ సస్పెండ్..?
రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిపోయిన నటి హేమకు మరో షాక్ తగిలినట్టు తెలుస్తోంది. ఆమెను మా మూవీ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయడానికి రంగం సిద్ధం అయినట్టు తెలుస్తోంది. గతంలో హేమపై ఆరోపణలు వచ్చిన సందర్భంలో మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆమెకు అండగా నిలిచారు. హేమ కేవలం ఆరోపణలు మాత్రమే ఎదుర్కొంటున్నారని..ఆమెపై నేరు రుజువు అయినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటామని మంచు విష్ణు ట్విట్టర్ వేదికగా తెలిపారు.
రేవ్ పార్టీకి వెళ్లిన సెలబ్రిటీలందరికీ బెంగళూరు క్రైం పోలీసులు నోటీసులు పంపించారు. నోటీసులందుకున్నవారిలో తెలుగు నుంచి హేమ కూడా ఉన్న విషయం తెలిసిందే.పోలీసుల విచారణకు మాత్రం హేమ హాజరవలేదు. వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నానంటూ లేఖ రాసింది. పోలీసులు మాత్రం ఆ లేఖను పరిగణనలోకి తీసుకోలేదు. అయితే సోమవారం హేమ విచారణకు ప్రత్యేకంగా ఆహ్వానించారు.

బెంగళూరులో రేవ్ పార్టీకి అటెండ్ అయిన వారు ఇచ్చిన బ్లడ్ శ్యాంపిల్స్‌లో అందరూ డ్రగ్స్ తీసుకున్నట్లుగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. అందులో నటి హేమ కూడా ఉండటంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు బుధవారం సాయంత్రం సమావేశమయ్యారు. కాగా, సమావేశంలో 'మా' నుంచి హేమను సస్పెండ్ చేయాలనే చర్చ జరిగిందని తెలుస్తోంది. అయితే, ఈ విషయంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు గురువారం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications