పుట్టిన రోజు నాడు మోహన్ బాబుకు మరో షాక్.. మంచు మనోజ్ షాకింగ్ పోస్ట్ !
విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు.. సామాన్య వ్యక్తిగా మొదలై.. అసామాన్య వ్యక్తిగా ఎదిగారు. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ 75 చిత్రాలను నిర్మించారు. అంతే కాకుండా త్వరలో నటుడిగా 50 యేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోనున్నారు. అలానే మరోవైపు సినిమా రంగం లోనే కాకుండా విద్యా రంగంలోనూ విశేష సేవలు అందిస్తున్నారు. 1992లో స్థాపించిన శ్రీ విద్యానికేతన్ విద్యా ట్రస్ట్ ద్వారా వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. 2022లో ప్రారంభమైన మోహన్ బాబు విశ్వవిద్యాలయం నుంచి ఎందరో విద్యను అభ్యసిస్తున్నారు.
అయితే గత కొద్ది నెలలుగా మంచు వారి ఫ్యామిలీలో గొడవలు జరుతుగున్న సంగతి తెలిసిందే. మోహన్ బాబు జల్‌పల్లిలోని నివాసం వద్ద మొదలైన ఈ వివాదం.. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్దకు కూడా చేరింది. మంచు విష్ణు- మనోజ్‌కు మధ్య మొదలైన గొడవే ఈ వివాదానికి కారణమని తెలుస్తోంది. ఈ గొడవల నేపథ్యంలో ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడం, మోహన్ బాబు మీడియా వ్యక్తిపై చేయి చేసుకోవడం, తండ్రి - కొడుకులైన మోహన్ బాబు, మంచు మనోజ్ ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకునే వరకు వచ్చింది. సోషల్ మీడియాలో సైతం విష్ణు, మనోజ్ ఇన్ డైరెక్ట్ గానే ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు.

అయితే ప్రస్తుతం ఎవరికి వారు తమ సినిమాల్లో బిజీ అవ్వడంతో ఈ గోడవకు ఫుల్ స్టాప్ పడిందని అంతా భావించారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా మంచు మనోజ్ పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. 1946 మార్చి 19న తిరుపతిలో జన్మించిన మోహన్ బాబు.. నేడు తన 73వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఈ క్రమంలోనే మంచు మనోజ్ తన తండ్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా మోహన్ బాబు ఫోటోను షేర్ చేస్తూ పుట్టినరోజు విషెస్ తెలిపారు. ఆ పోస్టులో.. తన తండ్రితో కలిసి సినిమాల్లో నటించిన జ్ఞాపకాలను గుర్తు చేసేలా ఒక వీడియోను కూడా పంచుకున్నారు. ఆ వీడియోలో 'నా సూర్యుడివి, చంద్రుడివి, నా దేవుడివి నువ్వే అంటూ యానిమల్ సాంగ్‌తో తండ్రిపై ప్రేమను చాటుకున్నారు. అంతే కాకుండా 'హ్యాపీ బర్త్ డే నాన్న.. ఈ రోజు నీ పక్కన ఉండి సెలబ్రేట్ చేసుకునే అవకాశాన్ని మిస్ అవుతున్నా.. అంటూ రాసుకొచ్చారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారగా.. మంచు లక్ష్మీ ఈ పోస్ట్ ని లైక్ చేశారు. మంచు ఫ్యామిలీ అభిమానులు సైతం కుటుంబంలో గొడవలు అన్నీ తొలగిపోయి త్వరలోనే అందరూ కలిసిపోవాలని కోరుకుంటూ మోహన్ బాబుకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇక ప్రస్తుతం మోహన్ బాబు విష్ణు హీరోగా నటిస్తున్న 'కన్నప్ప' మూవీలో నటిస్తున్నారు.












Click it and Unblock the Notifications