ప్రభాస్ ప్రపోజల్‌ను రిజెక్ట్ చేసిన అనుష్క
హీరోయిన్ అనుష్క శెట్టి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతి తక్కువ కాలంలోనే అనుష్క తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. తెలుగులో స్టార్ హీరోలందరితోనూ నటించి ఫుల్ పాపులారిటీని సంపాదించుకుందామె. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా అరుంధతి సినిమాతో అనుష్క రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. తెలుగులో హీరోలతో సమానంగా అనుష్కకు మార్కెట్ ఉందంటే అతిశేయోక్తి కాదు.
అయితే గత కొంతకాలంగా అనుష్క సినిమాలు చేయడం తగ్గించేసిందనే చెప్పాలి. జీరోసైజ్ సినిమాతో లావు పెరగిన అనుష్క తరువాత బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేసింది. దాదాపు 100 కేజీలకు పైగా బరువు పెరిగి షాకిచ్చింది. ఆవెంటనే నిశ్శబ్దం సినిమా కోసం బరువు తగ్గి మాములు స్థితిలోకి వచ్చింది. గతేడాది యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో అనుష్క ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఆ తరువాత మరే సినిమాను అనుష్క అంగీకరించలేదు. ఇదిలా ఉంటే అనుష్క పెళ్లికి సంబంధించి ఇప్పటికే చాలానే రూమర్స్ తెర మీదకు వచ్చాయి. హీరో ప్రభాస్‌తో అనుష్క ప్రేమలో ఉందని వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ చాలానే కథనాలు వెలుగులోకి వచ్చాయి.అయితే అవన్నీ కూడా కూడా ప్రచారాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. ఇదిలా ఉంటే ప్రభాస్ సినిమాను అనుష్క రిజెక్ట్ చేసిందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా అనుష్కను తీసుకోవాలని అనుకున్నప్పటికీ ఆ క్యారెక్టర్‌లో తాను సెట్ అవ్వననే ఉద్దేశ్యంతో ప్రభాస్ సినిమా నుంచి అనుష్క తప్పుకుందట.అనుష్క తప్పుకోవడంతో ఆదిపురుష్‌లో కృతిసనన్‌ను హీరోయిన్‌గా తీసుకోవడం జరిగింది. అయితే ఆదిపురుష్ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడంతో అనుష్క ఈ సినిమా నుంచి తప్పుకుని మంచి పని చేసిందని ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications