ఇది కదా అక్కినేని ఫ్యాన్స్‌కి కావాల్సింది.. రంగంలోకి లక్కీ క్వీన్స్ !
అక్కినేని నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల కుభేర, కూలీ సినిమాల్లో వైవిధ్య పాత్రలతో అలరించిన ఆయన.. ఇప్పుడు తన 100వ సినిమా కోసం సిద్దమవుతున్నారు. రీసెంట్ గానే ఈ చిత్రానికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కింగ్ 100 అనే వర్కింగ్ టైటిల్‌తో కార్తీక్ అనే తమిళ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
నాగ్ తన సొంత ప్రొడక్షన్ లో నిర్మిస్తున్న ఈ మూవీ పవర్ ఫుల్ యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలబోసిన చిత్రంగా తీర్చిదిద్దుతున్నామని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ సినిమా పోలిటికల్ డ్రామా నేపథ్యంలో సాగబోతోందని వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా ఈ కథ సీఎం పదవి కోసం జరిగే రాజకీయ సంఘర్షణల చుట్టూ తిరుగుతుందనే టాక్ ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది.

డ్యూయల్ రోల్..
ఈ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నాగార్జున డ్యూయల్ రూల్ లో కనిపించనున్నట్లు సమాచారం. ఒక పాత్ర రాజకీయ రంగంలో శక్తివంతమైన లీడర్ అయితే, మరో పాత్ర ఆయన యువకుడిగా ఉన్న కాలంలో నడిచే ఫ్లాష్‌బ్యాక్ అని చెబుతున్నారు. ఇలా రెండు టైమ్‌లైన్‌ల మధ్య సాగే ఈ కథలో ఆయన పాత్రల మధ్య ఉన్న మానసిక సంఘర్షణ, పరిస్థితుల మార్పు సినిమాకి కీలకంగా ఉండబోతోందని చెబుతున్నారు.
చైతూ & అఖిల్ స్పెషల్ అప్పియరెన్సెస్..
అంతే కాకుండా ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కుమారులు నాగ చైతన్య, అఖిల్ అక్కినేని కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారని ఇండస్ట్రీ టాక్. వారు ప్రత్యేక పాత్రలలో తండ్రితో స్క్రీన్ షేర్ చేయనున్నారట. అయితే ఇది పూర్తిస్థాయి పాత్రలా, లేక కేమియో రోల్‌లా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మొత్తానికి చాలా గ్యాప్ తర్వాత అక్కినేని తండ్రి-కొడుకుల కాంబినేషన్ స్క్రీన్ మీద చూడబోతున్నామనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రముఖ నటి టబు నటిస్తున్నట్లు సమాచారం. తొలుత ఈ పాత్రకు నయనతారను సంప్రదించినప్పటికీ, షెడ్యూల్ సమస్యల కారణంగా ఆమె అందుబాటులో లేకపోవడంతో చివరికి టబును ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. టబు పాత్ర కూడా రాజకీయ నేపథ్యంతో ఉన్న మహిళగా కనిపించబోతున్నారని సమాచారం. దాదాపు 27 ఏళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. నాగార్జునతో ఆమె సీన్స్ సినిమాకు స్పెషల్ హైలైట్ కానున్నాయని ఫిల్మ్ నగర్ టాక్.

అనుష్క సర్‌ప్రైజ్ ఎంట్రీ..
మరోవైపు ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా అనుష్క శెట్టిని కూడా తీసుకురావాలనే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇందుకోసం నిర్మాతలు ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపినట్లు సమాచారం. అనుష్క పాత్ర చిన్నదే అయినా, చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉండబోతోందని, ఆమె కోసం ప్రత్యేకంగా ఓ సీక్వెన్స్ రాసినట్లు తెలిసింది. ఒకవేళ ఇది నిజమైతే, నాగార్జున-అనుష్క జోడీ మళ్లీ తెరపై కనిపించనుందనే వార్త ఫ్యాన్స్‌లో ఉత్సాహం రేకెత్తిస్తోంది.
కాగా నాగార్జున కెరీర్ లో టబు చేసింది రెండు సినిమాలే అయిన ఎవర్ గ్రీన్ హిట్స్ గా నిలిచాయి. అలానే అనుష్కతో చాలా సినిమాలు చేశారు. దాదాపు అన్ని సినిమాలు హిట్స్ అయ్యాయి. దాంతో కింగ్ మళ్లీ తనకు బాగా కలిసొచ్చిన లక్కీ క్వీన్స్ ని రంగంలోకి దించుతున్నారని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. అంతే కాకుండా నాగ్ డ్యూయల్ రోల్ సెంటిమెంట్ కూడా బాగా కలిసొస్తుందని భావిస్తున్నారు.

-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications