రానాతో అనుష్క సంచలన ఆడియో కాల్ లీక్..ఈ ఏడాదిలోనే పెళ్లి..వరుడు అతనే..?

టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోయిన్ల.. జాబితాలో అనుష్క ముందు వరుసలో ఉంటుందనే చెప్పాలి. నాగార్జున నటించిన సూపర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన అనుష్క అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ముఖ్యంగా 'అరుంధతి' సినిమాతో అనుష్క రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. తెలుగులో హీరోలతో సమానంగా అనుష్కకు మార్కెట్ ఉందంటే అతిశయోక్తి కాదు.

అయితే గత కొంతకాలంగా అనుష్క సినిమాలు చేయడం తగ్గించేసిందని చెప్పాలి. జీరో సైజ్ సినిమాతో లావు పెరిగిన అనుష్క తరువాత బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేసింది. దాదాపు 100 కేజీలకు పైగా బరువు పెరిగి షాకిచ్చింది. ఆ వెంటనే నిశ్శబ్దం సినిమా కోసం బరువు తగ్గి మాములు స్థితిలోకి వచ్చింది. ఇక యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాతో అనుష్క ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Anushka Shetty Confirms Her Marriage Audio Call with Rana Daggubati Goes Viral

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం 'ఘాటి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉంటే అనుష్క పెళ్లికి సంబంధించి అనేక వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. హీరో ప్రభాస్, అనుష్క ప్రేమలో ఉన్నారని, త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ అనేక కథనాలు వెలువడ్డాయి.

అయితే తాము కేవలం స్నేహితులమే అని , తమ మధ్య ఎలాంటి బంధం లేదని వీరిద్దరు క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత అనుష్క ఓ నిర్మాతను వివాహం చేసుకోబోతుందంటూ మరికొన్ని వార్తలు వచ్చాయి. తాజాగా అనుష్క పెళ్లికి సంబంధించి మరో వార్త బయటకు వచ్చింది. అనుష్క రానాతో మాట్లాడిన ఆడియో కాల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఆడియో కాల్‌లో రానాతో అనుష్క మాట్లాడుతూ.. అందరూ పెళ్లి గురించే అడుగుతున్నారని అనుష్క తెలిపింది. వెంటనే రియాక్ట్ అయిన రానా 'ఏంటి నీ పెళ్లా' అంటూ అనుష్కను ప్రశ్నించారు. దీనిపై అనుష్క నవ్వుతూ.. 'లేదు లేదు' అందరూ పెళ్లి గురించి అడుగుతున్నారని రానాకు వివరణ ఇచ్చింది అనుష్క. ఈ ఏడాది చివర్లో నా పెళ్లి ఉంటుందని అనుష్క చెప్పుకొచ్చింది.

దీంతో అనుష్క ఈ సంవత్సరం పెళ్లి చేసుకుటుందనే విషయం అందరికి అర్థం అయిపోయింది. అయితే పెళ్లి కొడుకు ఎవరా అనేది మాత్రం తెలపలేదు. అభిమానులు మాత్రం అనుష్క, ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అనుష్క, రానా మాట్లాడిన ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+