ఏ 'సైజ్' అంటూ అనుష్క ముందు అసభ్యంగా మాట్లాడిన యాంకర్
టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోయిన్ల.. జాబితాలో అనుష్క ముందు వరుసలో ఉంటుందనే చెప్పాలి. నాగార్జున నటించిన సూపర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచియం అయిన అనుష్క అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ముఖ్యంగా అరుంధతి సినిమాతో అనుష్క రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. లుగులో హీరోలతో సమానంగా అనుష్కకు మార్కెట్ ఉందంటే అతిశేయోక్తి కాదు.
అయితే గత కొంతకాలంగా అనుష్క సినిమాలు చేయడం తగ్గించేసిందనే చెప్పాలి. జీరోసైజ్ సినిమాతో లావు పెరగిన అనుష్క తరువాత బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేసింది. దాదాపు 100 కేజీలకు పైగా బరువు పెరిగి షాకిచ్చింది. ఆవెంటనే నిశ్శబ్దం సినిమా కోసం బరువు తగ్గి మాములు స్థితిలోకి వచ్చింది. గతేడాది యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో అనుష్క ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. అనుష్క పరిశ్రమకు వచ్చి దాదాపు 19 ఏళ్ళు అవుతుంది. సుదీర్ఘ కెరీర్ లో అనుష్కపై ఒక్క కాంట్రవర్సీ లేదు. ఆమె నిర్మాతల హీరోయిన్ అంటారు. అయితే అనుష్క ఎఫైర్ రూమర్స్ ఎదుర్కోవడం విశేషం. ప్రభాస్ తో పాటు మరికొందరు హీరోలతో ఆమె ఎఫైర్ నడిపిందంటూ పుకార్లు ఉన్నాయి. తాజాగా అనుష్కకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
బాహుబలి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న అనుష్కను ఓ యాంకర్ ఇబ్బందికర ప్రశ్నలు అడిగడం జరిగింది. అనుష్క లావుగా కనిపించడంతో XXX, XX కూడా దొరుకుతాయా అంటూ సైజ్ పై కామెంట్స్ చేశాడు. దీనికి అన్సర్ ఇచ్చిన స్వీటీ .. చివరకు కొంచెం ఆరోగ్యకరంగా మాట్లాడాలని యాంకర్‌కు సూచించింది. అనుష్క ఇచ్చిన కౌంటర్‌కు సదరు యాంకర్ సైలెంట్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications