మెగా 158లో చిరుకి జోడీగా స్టార్ హీరోయిన్ ఫిక్స్.. కోరిక తీరినట్టే !!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర'.. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో 'మన శంకరవరప్రసాద్ గారు.. పండక్కి వస్తున్నారు' చిత్రాలు చేస్తున్నారు. అలానే తన నెక్స్ట్ సినిమాను కూడా రీసెంట్ గానే తన పుట్టిన రోజూ సందర్భంగా అనౌన్స్ చేశారు. 'మెగా 158' వర్కింగ్ టైటిల్ తో ఆ మూవీ రాబోతుంది. గతంలో 'వాల్తేరు వీరయ్య'తో హిట్ కొట్టిన బాబీ కొల్లి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది.
దసరా సందర్భంగా సెట్స్ మీదకి వెళ్లనున్న ఈ మూవీపై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడాయి. అయితే లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి ఓ బిగ్ అప్డేట్ తవలలివ్వవద వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్‌లో రక్తంతో తడిసిన గొడ్డలి, రక్తం చిందిన బ్యాక్‌డ్రాప్ తో చూపించారు. కాగా ఈ మూవీలో హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ ని బాబీ రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది.

సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్ అనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అనుష్క శెట్టి. బాహుబలి సిరీస్ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చింది.
చివరిగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో హిట్ కొట్టగా.. నాలుగేళ్ల తర్వాత ఘాటితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఇప్పుడు మళ్లీ చిరుతో కలిసి మెగా 158లో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్టు సమాచారం. తెలుగులో స్టార్ హీరోలందరితోనూ నటించిన అనుష్క చిరంజీవితో ఇప్పటివరకు స్క్రీన్ షేర్ చేయలేదు. ఆమె కెరీర్ ప్రారంభంలో చిరంజీవితో 'స్టాలిన్' సినిమాలో ఒక సాంగ్‌లో మాత్రమే నటించిన సంగతి తెలిసిందే. మళ్లీ 17 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ అయితే మామూలుగా ఉండదంటూ ఫీసన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

అనుష్క కూడా ఈ ఆఫర్‌పై పాజిటివ్‌గా రెస్పాన్స్ అయ్యారని.. గతంలో కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "చిరంజీవితో నటించాలన్న కోరిక ఉంది" అని వెల్లడించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
Feeling blessed to collaborate with the one and only Megastar @KChiruTweets garu for the 2nd time 🙏❤️ #Mega158 is going to be a RAMPAGE in every aspect. 🔥🔥
— Bobby (@dirbobby) August 22, 2025
Thrilled to share this MASSIVE journey with all the fans!
HBD MEGASTAR - THE BLOODY BENCHMARK!! 🪓💥… pic.twitter.com/r37Ke6q1zo
మరోవైపు ఈ చిత్రంలో విలన్ పాత్రలో మంచు మనోజ్ ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. 'మిరాయ్' సినిమాలో ప్రతినాయకుడిగా తన నటనకు ప్రశంసలు అందుకున్న మనోజ్ ఇప్పుడు చిరంజీవికి విలన్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తే సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడం పక్కా అంటున్నారు. చూడాలి మరి బాబీ ఈసారి ఏం మ్యాజిక్ చేస్తారో అని.
-
"మొన్న చెప్పి హిట్టు కొట్టా.. మళ్లీ చెప్తున్నా బంపర్ బ్లాక్ బస్టర్" -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే! -
'బైకర్' ట్రైలర్ రిలీజ్.. శర్వానంద్ ఈసారి హిట్ కొట్టేశాడోచ్..! -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మీకు అర్థమవుతోందా?.. ‘ధురంధర్2’ తీయడం వెనక పక్కా రాజకీయ వ్యూహం -
'అమ్మా.. నాకు ఈ యాక్టింగ్ వద్దు!': కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరోయిన్!! -
ఐ లవ్డ్ ధురంధర్ 1.. బట్ - జక్కన్న సెన్సేషన్ రివ్యూ: అలాంటి హీరోలందరినీ చంపేసింది -
కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్.. -
ఉస్తాద్‌కు ధురంధర్ డెంటు పెట్టేసాడుగా..! -
ఓటీటీని షేక్ చేస్తున్న చిన్న సినిమా.. హీరో కూడా లేడు !! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
బన్నీ మూవీలో ఐదుగురు భామలా? అట్లీ స్కెచ్ మామూలుగా లేదుగా!












Click it and Unblock the Notifications