‘చికిరి చికిరి’ పాటతో రెహమాన్ సంపాదించినదెంతో తెలిస్తే నోరెళ్లబెడతారు

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అందరూ ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' టాప్ లిస్టులో ఉంది. నిజం చెప్పాలంటే, చరణ్ కెరీర్‌లో మరే సినిమాకు లేనంత హైప్ పెద్ది చిత్రానికి వచ్చింది. దిగ్గజ దర్శకుడు శంకర్‌తో చేసిన 'గేమ్ చేంజర్' కంటే కూడా, 'పెద్ది' సినిమాపై ఆరంభం నుండే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని పెంచేసింది. దీనికి ప్రధాన కారణం, 'రంగస్థలం' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత చరణ్ మళ్ళీ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో చేస్తున్న సినిమా కావడమే. దానికి తోడు, ఇటీవల విడుదలైన గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలను భారీగా పెంచింది.

రూపాయి తీసుకోకుండా పని ప్రారంభించాడు

ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత రెహమాన్ నుండి ఒక పక్కా మాస్ చార్ట్‌బస్టర్ సాంగ్ రాబోతుందని అభిమానులు ఆశించగా, దానికి తగ్గట్టుగానే 'చికిరి చికిరి' పాట గ్లోబల్ వైడ్‌గా దుమ్మురేపుతోంది. తాజాగా రెహమాన్ గొప్పతనం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప్రాజెక్ట్ ఓకే చేసినప్పుడు ఆయన రెమ్యూనరేషన్ గురించి అసలు ఇంత కావాలి అని నోరు తెరిచి అడగలేదు. బుచ్చిబాబు చెప్పిన కథ నచ్చడంతో, నిర్మాతలు తన విలువకు తగ్గట్టుగానే ఇస్తారనే నమ్మకంతో ఒక్క రూపాయి కూడా అడగలేదు.. తీసుకోలేదు.. వెంటనే పనిని ప్రారంభించాడు.

AR Rahman You will be astonished if you find out how much he earned from the song Chikiri Chikiri

మొత్తంగా రూ.28 కోట్లు

'చికిరి చికిరి' పాట సృష్టించిన ప్రభంజనాన్ని చూసి నిర్మాతలు సంతోషపడ్డారు. రెహమాన్ అందించిన అవుట్‌పుట్‌కు ఫిదా అయిన మేకర్స్, ఆయనకు ఏకంగా 15 కోట్ల రూపాయల అడ్వాన్స్ చెక్ అందజేశారు. అడ్వాన్సే ఇలా ఉంటే పూర్తి రెమ్యునరేషన్ 28 కోట్ల రూపాయలు రెహమాన్ అందుకోబోతున్నారని తెలుస్తోంది. ఒక మ్యూజిక్ డైరెక్టర్‌కు భారతదేశంలోనే ఇది అత్యధిక రెమ్యూనరేషన్. ఇంతవరకు ఎవరూ ఇంత తీసుకోలేదు. సాధారణంగా ఒక మీడియం రేంజ్ సినిమా బడ్జెట్ మొత్తాన్ని రెహమాన్ పారితోషికం కింద చెల్లించారు. దీన్నిబట్టి'పెద్ది' ఆడియో ఏ స్థాయిలో ఉండబోతుందో ఊహించుకోవచ్చు. రెహమాన్ మ్యూజిక్, చరణ్ మాస్ మేకోవర్ తోడైతే పెద్ది సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయమనే నమ్మకంతో మెగా అభిమానులున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+