నువ్వేమైనా చరిత్రకారుడివా?- సే సారీ టు..: హైకోర్టు
Thug Life: లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం.. థగ్ లైఫ్. మణిరత్నం దర్శకుడు. ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చారు. శిలంబరాసన్ టీఆర్, జయం రవి, జోజు జార్జ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, అభిరామి.. ఇందులో కీలక పాత్రల్లో నటించారు.
300 కోట్ల రూపాయలతో పాన్ ఇండియాగా తెరకెక్కిన ఈ సినిమాను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. విడుదల తేదీ సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో కర్ణాటకలో బ్యాన్ ను ఎదుర్కొంటోందీ మూవీ. కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం.

మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కమల్ ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళం నుంచే కన్నడ జన్మించిందని చెప్పుకొచ్చారు. ఇది- కన్నడ భాషాభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ఈ సినిమాను బహిష్కరించాలని కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) ఇటీవల నిర్ణయం తీసుకుంది కూడా.
ఈ నేపథ్యంలో రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్.. కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. థగ్ లైఫ్ సినిమా ప్రదర్శనలకు అనుమతి ఇచ్చేలా ఆదేశాలు జారీచేయాలని కోరింది. కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, పూర్తి వీడియోను మరుగునపెట్టారని రాజ్ కమల్ ఫిల్మ్స్ తరఫు న్యాయవాది ధ్యాన్ చిన్నప్ప వాదించారు.
కర్ణాటకలో ఎటువంటి అంతరాయం లేకుండా సినిమాను ప్రదర్శించడానికి వీలుగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇదివరకు చిత్రం యూనిట్.. రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు ఓ వినతి పత్రాన్ని సైతం సమర్పించారని వివరించారు. దీనిపై కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో.. హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
దీనిపై కర్ణాటక హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కమల్ హాసన్ ను తప్పు పట్టింది. భాష పుట్టుపూర్వోత్తరాల గురించి వ్యాఖ్యానించడానికి కమల్ హాసన్ ఏమైనా చరిత్రకారుడా? లేక భాషోద్యమకారుడా? అని నిలదీసింది. కోట్లాదిమంది కన్నడిగుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం సబబు కాదని, దీన్ని సమర్థించలేమనీ తేల్చి చెప్పింది.
ఆయన చేసిన అనాలోచిత వ్యాఖ్యల వల్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయని, సినిమా ప్రదర్శనకు రక్షణ కల్పిస్తూ ఆదేశాలు ఇస్తే- రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి అది అదనపు భారమౌతుందని హైకోర్టు సింగిల్ జడ్జ్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ ఎం నాగప్రసన్న స్పష్టం చేశారు.
భావ ప్రకటనా స్వేచ్ఛ అంటే ప్రజల మనోభావాలను దెబ్బతీయడం కాదని పేర్కొన్నారు. ఈ వివాదం సమసిపోవాలనుకుంటే కమల్ హాసన్ ఒక్క క్షమాపణ చెబితే సరిపోతుందని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. క్షమాపణ చెప్పనప్పుడు కర్ణాటకలో సినిమాను ఎందుకు ప్రదర్శించాలనుకుంటున్నారని ప్రశ్నించారు. క్షమాపణ చెబితే ఏ సమస్యా ఉండదని వ్యాఖ్యానించారు.
అనంతరం ఈ పిటీషన్ పై తదుపరి విచారణను ఈ మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేశారు. చట్టం ప్రకారం అవసరమైన విధంగా ఉత్తర్వులు జారీ చేస్తామని, ఈలోగా కమల్ హసన్ క్షమాపణ చెప్పాలనుకుంటున్నారా? లేదా? అనే దానిపై వివరణ ఇవ్వాలని న్యాయవాది ధ్యాన్ చిన్నప్పను ఆదేశించారు.
-
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications