లెజెండరీ సింగర్ ఆశ భోస్లే కు గుండెపోటు.. పరిస్థితి విషమం

బాలీవుడ్ లెజెండరీ సింగర్ ఆశ భోంస్లే(92)కు గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శనివారం రాత్రి ఆశ భోంస్లేకు గుండెపోటు రావడంతో వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఇక ఏడు దశాబ్దాలకు పైగా సినీ చరిత్రలో తన గాత్రంతో తనదైన ముద్ర వేశారు ఆశ భోస్లే.

భారతదేశం గర్వించదగ్గ లెజెండరీ సింగర్ ఆశ భోస్లే గుండెపోటుకు గురయ్యారు. ఇది గమనించిన ఆమె కుటుంబ సభ్యులు వెంటనే ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తన గాత్రంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు ఆశ భోస్లే. వేల పాటలు పాడారు. బప్పి లహరి, ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ వంటి ఎంతో మంది లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్లతో పని చేశారు.

AshaBhosle 92 Hospitalised After Heart Attack at Breach Candy Hospital Mumbai Asha Bhosle news

ఇక ఆశ భోస్లే సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆమెకు 2000వ ఏడాదిలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, 2008లో పద్మ విభూషణ్ పురస్కారాలను అందించి గౌరవించింది. అలాగే అత్యధిక పాటలు పాడిన మహిళా సింగర్ గా ఆశ భోస్లే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో స్థానం దక్కించుకున్నారు. హిందీ, మరాఠీ, తమిళం, తెలుగు, బెంగాలీ, మలయాళం, కన్నడ, గుజరాతీ, ఒడియా.. ఇలా దాదాపు 20 భాషల్లో ఆశ భోస్లే తన గాత్రంతో అలరించారు. ఇక ఆశ భోస్లే ఆరోగ్యం గురించి తెలుసుకున్న అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+