ఐసీయూలో బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

బిగ్ బాస్ షోతో గుర్తింపు తెచ్చుకుంది బుల్లితెర నటి అషు రెడ్డి. ఆ తర్వాత పలు టీవీ షోల్లో పాల్గొని యూత్ లో ఫుల్ క్రేజ్ కొట్టేసింది. ఆ తర్వాత పలు ఈవెంట్స్ లోనూ సందడి చేసింది. కొన్నేళ్లపాటు యాంకర్‌గానూ రాణించి పలు షోలను విజయవంతగా నడిపించింది. ఇక అటు సోషల్ మీడియాలోనూ అమ్మడు ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ఇండస్ట్రీలో అందరూ జూనియర్ సమంత అంటూ ఉంటే తెగ మురిసిపోయింది . ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూతో ఒక్కసారిగా సెన్సేషనల్ అయిపోయింది అషు రెడ్డి.

ఇక సినిమాల విషయానికి వస్తే ఛల్ మోహనరంగ, బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్, ఎ మాస్టర్ పీస్ చిత్రాల్లో మెరిసింది. అయితే కొంత కాలంగా అషు రెడ్డి అనారోగ్యంతో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఆమెకు బ్రెయిన్ సర్జరీ అయింది. దాదాపు చావు చివరి అంచుల్లోకి వెళ్లి బయటపడింది. ఈ మెమోరీస్ ను తాజాగా ఇన్ స్టా ద్వారా ఓ వీడియో లో షేర్ చేసుకుంది. ఈ వీడియోలో అషును చూస్తే కన్నీళ్లు ఆగవు అనుకోండి.

Ashu Reddy s Brain Surgery Video Goes Viral on Social Media

ఈ వీడియోలో అషు రెడ్డి అనారోగ్యంతో తాను పడ్డ బాధలను వివరించింది. హాస్పిటల్ బెడ్ పై తీసిన ఆ షాట్స్, తలపై మెడికల్ బ్యాండేజీ, షేవ్ చేసిన హెయిర్ లైన్.. ఇవన్నీ చాలా భావోద్వేగంగా ఉన్నాయి. "లైఫ్ అంటే ఇదే.. దయతో ఉండండి, గొప్పలకు పోకుండా ఉండండి. ఇది ఎంతో మందిని బాగుచేస్తుంది" అనే క్యాప్షన్‌తో ఆమె పెట్టిన ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అంతేకాక చిరంజీవి నటించిన శంకర్ దాదా సినిమాలోని 'ఓడిపోవడం తప్పు కాదురా' అనే లిరిక్స్ ను ఆ వీడియోకు యాడ్ చేసి పోస్ట్ చేసింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు బ్రెయిన్ సర్జరీ నుంచి విజయవంతగా బయటపడినందుకు కంగ్రాట్స్ చెబుతున్నారు. మరికొంత మంది టేక్ కేర్ అని కామెంట్స్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+